Begin typing your search above and press return to search.

నీహారికను ఇబ్బంది పెడుతున్న హీరో

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:30 AM GMT
నీహారికను ఇబ్బంది పెడుతున్న హీరో
X
మెగా డాటర్ నీహారిక టాలీవుడ్ అరంగేట్రానికి అన్నీ సిద్ధమైపోయాయి. మరో పది రోజుల్లో జూన్ 24న ఈమె నటించిన తొలి సినిమా 'ఒక మనసు' విడుదల కానుంది. ఆడియో ఫంక్షన్ జరిగి రెండు వారాలైనా.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసినా.. ఈ సినిమా హీరో నాగశౌర్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా నీహారిక ప్రమోషన్ మాత్రమే ఉంటోంది.

ఈ సినిమా ప్రచారానికి సంబంధించి.. మీడియా జనాలు ఈ సినిమా హీరోగా తనను గుర్తించడం లేదని తెగ ఫీల్ అవుతున్నాడట నాగశౌర్య. అందుకే ఒక మనసు ప్రమోషన్స్ కు పూర్తిగా హ్యాండ్ ఇచ్చేశాడట నాగశౌర్య. ఇలా హీరో ఇబ్బంది పెడుతుండడంతో.. ఆ వర్క్ ను కూడా తనే హ్యాండిల్ చేసేస్తోంది నీహారిక. ఎలాగూ ఫేసాఫ్ ది సినిమా నీహారికే. ఇప్పుడు ప్రమోషన్స్ ను కూడా స్వయంగా చేసేస్తోంది. ఈ విషయంలో బాలీవుడ్ కల్చర్ ని పక్కాగా ఫాలో అయిపోవాలని మెగా డాటర్ నిర్ణయించుకుంది.

టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలతోపాటు గేమ్ షోస్-రియాల్టీ షోస్ లో పార్టిసిపేట్ చేసి ప్రచారం చేసుకోనుందని తెలుస్తోంది. గతంలో యాంకర్ గా చేసిన అనుభవం కూడా ఉండడంతో.. ఈమెతో స్పెషల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఛానల్స్ జనాలు కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొత్తం మీద తన తొలి సినిమాని భారీ హిట్ చేసేందుకు తెగ కష్టపడుతోంది నీహారిక. దీని రిజల్ట్ ఆధారంగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయాలా వద్దా అనే అంశం బేస్ అవుతుంది. అందుకే ఇంతగా కష్టపడి ప్రచారం చేసుకుంటోంది ఈ మెగా డాటర్.