Begin typing your search above and press return to search.

మెగా ట్యాగ్ పై నమ్మకం లేదా?

By:  Tupaki Desk   |   20 Jun 2016 5:20 AM GMT
మెగా ట్యాగ్ పై నమ్మకం లేదా?
X
మెగా కాంపౌండ్ నుంచి అరడజన్ మంది హీరోలు టాలీవుడ్ లో చక్రం తిప్పుతుండగా.. ఇప్పుడు మెగా డాటర్ నీహారిక అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఒక మనసు చిత్రంతో నాగబాబు కూతురు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ మూవీనే చేయడానికి కారణం.. ఆ సినిమాలోని సంధ్య పాత్ర తనకు విపరీతంగా నచ్చడమే అని చెప్పిన నీహారిక.. మెగా అభిమాను అండ తనకు ఉందని అంటోంది.

నాన్న - పెద నాన్నలను ఒప్పించాక ఫ్యాన్స్ నుంచి అభ్యంతరాలు వచ్చిన మాట వాస్తవమే అయినా.. వారికి తన లక్ష్యం ఏంటో చెప్పానని, గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటానని చెప్పినట్లు తెలిపింది నీహారిక. అలాగని తనకు గ్లామర్ పాత్రలు చేసేవారిపై చిన్న చూపు లేదని.. ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు.. గ్లామర్ ను - యాక్టింగ్ ను బేలన్స్ చేస్తున్నట్లు నీహారిక అభిప్రాయపడింది.

'మెగా ట్యాగ్ తో అరంగేట్రం చేస్తుండడంతో చాలా సంతోషంగా ఉంది. అయితే.. ఇది నాకు మొదటి సినిమాకు మాత్రమే ఉపయోగపడుతుంది. నేను నటిగా ప్రూవ్ చేసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుందని నాకు తెలుసు. మా సోదరుడు వరుణ్ తేజ్ సినిమా అయినా సరే బాగుంటేనే రెండోసారి చూస్తాను. ఈ ఫ్యామిలీ ట్యాగ్ కొంతవరకే ఉపయోగపడుతుంది. తర్వాత నాకు ట్యాలెంట్ ఉంటేనే నిలబడతానని నాకు తెలుసు' అంటూ తన ఐడియాలజీని స్పష్టంగానే చెప్పింది నీహారిక.