Begin typing your search above and press return to search.

నాన్న‌, పెద‌నాన్న‌ను తిట్టేస్తే త‌ట్టుకోలేను!

By:  Tupaki Desk   |   28 March 2019 12:14 PM GMT
నాన్న‌, పెద‌నాన్న‌ను తిట్టేస్తే త‌ట్టుకోలేను!
X
రాజ‌కీయాల్లో తిట్లు, చీవాట్లు మామూలు వ్య‌వ‌హారం. మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు రాజ‌కీయాల్లోకి వెళ్లాక ఆ ఇద్దరినీ పొగిడేవాళ్ల కంటే తిట్టే వాళ్లే ఎక్కువ‌య్యారు. జ‌న‌సేన పార్టీని పెట్టి ప‌వ‌న్ క‌ల్యాణ్ తిట్లు తింటున్నారు. ఇలా మీ వాళ్ల‌ను తిట్టేస్తుంటే మీకేమీ అనిపించ‌దా? మీరు హ‌ర్ట‌వ్వ‌రా? అని కొణిదెల న‌ట‌వార‌సురాలు నిహారిక ను ప్ర‌శ్నిస్తే ఊహించ‌ని విధంగా రెస్పాండ్ అయ్యారు.

స్థాయిని బ‌ట్టి పొగ‌డ్త‌లు, తిట్లు రెండూ ఉంటాయి. అన్నిటినీ భ‌రించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉండాలి! అంటూ ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చారు నిహారిక‌. 'మా వాళ్ల‌ను తిడ‌తారు కాబ‌ట్టి చాలా వ‌ర‌కు ఆ వీడియోలు చూడ‌ను. అయినా మ‌న‌ల్ని మ‌నం ఆ స్థాయిలో పెట్టిన‌ప్పుడు ఎవ‌రు ఏమ‌న్నా విన‌డానికి సిద్ధంగా ఉండాలి. కాక‌పోతే నేను న‌న్ను ఎవ‌రైనా ఏమైనా అన్నా వింటేనేమో కానీ, వాళ్ల‌ని ఎవ‌రైనా ఏమైనా అంటే త‌ట్టుకోలేను' అని అన్నారు.

మీరు ఈ రంగంలోకి రావాల‌ని అనుకున్న‌ప్పుడు మెగా ఫ్యాన్స్ వ్య‌తిరేకించారు క‌దా? అని ప్ర‌శ్నిస్తే.. వాళ్లంతా చాలా చాలా ఊహించేసుకున్నారు. ఇండ‌స్ట్రీ అంటే స్వేచ్ఛ‌.. పార్టీలు.. గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌లు .. వేషాలు అంటూ ఏవేవో ఊహించేసుకున్నారు. కానీ నేను ఇండ‌స్ట్రీ అంటే ఇదీ అని చూపించే ప్ర‌య‌త్న ం చూశాను. ప‌ద్ధ‌తిగా ఉండే వాళ్ల‌కు ఏ చిక్కులు ఉండ‌వు అని అన్నారు. పెద్ద తెర రంగం కంటే వెబ్ సిరీస్ ల‌లో మీకు సౌక‌ర్య ం ఎక్కువా? అంటే 'వెధ‌వ‌లు అన్ని చోట్లా ఉంటారు' అని ఖ‌రాకండిగా చెప్పేశారు.