Begin typing your search above and press return to search.
వివాహ కానుకగా నిహారిక కు అత్యంత ఖెరీదైన గిఫ్ట్స్..!
By: Tupaki Desk | 10 Dec 2020 5:03 AM GMTమెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు మాజీ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గల ఉదయ్ విలాస్ లో బుధవారం(డిసెంబర్ 9) రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా, అల్లు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఇక నిహారిక కు మెగా - అల్లు ఫ్యామిలీలు సుమారు 6 కోట్ల విలువ చేసే కానుకలు అందించినట్లు తెలుస్తోంది.
నిహారిక పెదనానన్న మెగాస్టార్ చిరంజీవి వివాహ కానుకగా దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే ప్రత్యేకమైన ఆభరణాలు బహుమతిగా ఇచ్చారని సమాచారం. అలానే బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఖరీదైన గిఫ్ట్ అందించినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ - రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ లు కూడా నిహారిక కు బహుమతులు అందించారట. చెల్లెలి కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకమైన బహుమతి అందించారని సమాచారం. మొత్తం మీద మెగా డాటర్ కి 6 కోట్లకు పైగా విలువ చేసే గిఫ్ట్స్ అందించారట. ఇదిలా ఉండగా డిసెంబర్ 11, శుక్రవారం నాడు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా చైతన్య - నిహారిక ల రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరూ హాజరు కానున్నారు.