Begin typing your search above and press return to search.
డేటింగ్ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా లేదు
By: Tupaki Desk | 20 Jun 2016 10:07 AM GMTఒక మనసు మూవీ ప్రమోషన్ సంగతేమో గానీ.. ఆ మూవీ ప్రమోషన్ కి ముందుకొచ్చిన ఆ చిత్ర హీరో.. హీరోయిన్లకు మాత్రం మీడియా నుంచి షాకింగ్ ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దాంతో ఆ హీరో హీరోయిన్లు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్దందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా.. టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. మొన్న నాగశౌర్య మీడియా ముందుకొచ్చినప్పడు... మీరు నిహారికతో డేటింగ్ చేస్తున్నారంటగా అని ప్రశ్న ఎదురవ్వగానే.. కాసేపు షాక్ కు గురైన నాగశౌర్య.. అవునండి నేనూ విన్నాను.. అదేంటో.. ఏ సినిమాలో నేను నటిస్తే.. ఆ హీరోయిన్ కు నాకు లింకు పెట్టుస్తున్నారని అన్నాడు. ఇంకో అడుగు ముందుకేసి.. నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పా.. ఆమెతో మాత్రం నాకు లింకు పెట్టడం లేదు. భవిష్యత్తులో ఏమైనా గాసిప్స్ పుట్టిస్తారేమో చూద్దాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత నిన్నటి రోజు మీడియా ముందుకొచ్చిన నిహారిక కూ మీడియా నుంచి ఇంచు మించు ఇలాంటి క్వశ్చనే మీడియా నుంచి రైజ్ అయింది. నాగశౌర్య మీతో డేటింగ్ చేయడం లేదు అంటున్నాడు.. అసలు అతను అలా అనడానికి కారణం ఏంటి? ఈ విషయం మీ దృష్టికొచ్చిందా? అంటూ ప్రశ్నించడంతో.. అలాంటిదేమీ తెలియదని... మీరు అడక్కుండానే అతను అలా అన్నాడా అని అమాయకంగా మీడియా ప్రతినిధులను ప్రశ్నించింది. ఆ సమయంలో నిహారిక తల్లి కూడా ఇంటర్వ్యూ జరిగే రూములోనే వుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం వుంది. బోలెడంత ప్రచారం చేయాల్సి వుంది. దాంతో ముందు కూడా ఈ జంటకు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. చూస్తుంటే.. ఇప్పట్లో ఈ డేటింగ్ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా లేదనిపిస్తోంది. మరి ఇదంతా వింటున్న మెగా ఫ్యామిలీ ఫైనల్ గా ఎలా స్పందిస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తోంది టాలీవుడ్.