Begin typing your search above and press return to search.

మ‌బ్బుల్లో ప‌క్షిలా విహారించిన నిహారిక‌!

By:  Tupaki Desk   |   6 Dec 2021 9:33 AM GMT
మ‌బ్బుల్లో ప‌క్షిలా విహారించిన నిహారిక‌!
X
మెగా ప్రిన్సెస్ నిహారిక‌- త‌న‌ భ‌ర్త చైత‌న్య స్పెయిన్ అందాల న‌డుమ విహ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ‌ కోస్టాస్ బీచ్.. అద్భుత‌మైన రోమ‌న్ శిధిలాల మ‌ధ్య ఈ కొత్త జంట దిగిన ఫోటోల్ని అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా నిహారిక ఏకంగా నిన్న‌టి రోజున పెద్ద సాహ‌స‌మే చేసింది.

స‌క్సెస్ ఫుల్ గా స్కైడైవింగ్ ని పూర్తిచేసి నిహారిక త‌న‌లో దైర్య‌సాహ‌సాల్ని ప్ర‌పంచానికి చాటి చెప్పింది. రెండు రెక్క‌ల ప‌క్షిలా గాల్లో తేలుతూ మ‌బ్బుల్లో స్వేచ్ఛ‌గా విహ‌రించింది. స్కై డైవింగ్ డ్రెస్ ధ‌రించి కారు మ‌బ్బుల్లో క‌లిసి పోయింది. ఆమెతో పాటు ట్రెయిన‌ర్ కూడా వెంట ఉన్నారు.

తాజాగా ఆ వీడియోని ఇన్ స్టాలో అభిమానుల‌కు షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట జోరుగా వైర‌ల్ అయింది. నిహారిక వీడియోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ``స్కైడైవింగ్ అబ్బాయిలే కాదు..అమ్మాయిలు చేయ‌గ‌ల‌రు`` అని ధైర్య‌సాహ‌సాల గురించి అంది. చివ‌రిగా ల్యాండ్ అయ్యే మూమెంట్ లో అపండ్రోయి ఒక్క క్ష‌ణం.. అంటూ వ్యాఖ్యానించింది.

నిహారిక డేరింగ్ ఫీట్ సోష‌ల్ మీడియాలో అద్భుత‌మైన రెస్సాన్స్ వ‌చ్చింది. ఫాలోవ‌ర్స్ అంతా నిహారిక ధైర్యం చూసి ఆకాశానికి ఎత్తేసారు. న‌టి లావాణ్య త్రిపాఠీ కూడా వీడియోని ఉద్దేశించి ప్ర‌శంసించింది.

ముందు ధైర్యంగా రంగంలోకి దిగిపోయిన నిహారిక‌కు త‌ర్వాత చాలా సందేహాలే వ‌చ్చాయండోయ్. గాల్లో ఎగురుతుండ‌గా పారాచూట్ తెరుచుకోక‌పోతే ప‌రిస్థితి ఏంటి? విమానంలో ఇంధ‌నం అయిపోతే ఏం చేయాలని సందేహించింది. అయితే ఇలాంటి డౌట్లు విమానం ఎక్క‌క ముందు...స్కైడైవింగ్ కి పూనుకోక ముందు ఆలోచించాలి.

సీన్ లోకి దిగిన త‌ర్వాత సందేహాలు మొద‌లైతే మొద‌టికే ముప్పు వ‌స్తుంది.. కానీ ఈ సాహ‌స‌ఘ‌ట్టం చాలా అరుదైన‌ది.. అసాధార‌ణ‌మైన‌ది కాబ‌ట్టి త‌న‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిహారిక‌-చైత‌న్య మొద‌టి పెళ్లి వార్షికోత్స‌వాన్ని డిసెంబ‌ర్ 9న గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకోనున్నారు. దీనిలో భాగంగా స్పెయిట్ టూర్ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.