Begin typing your search above and press return to search.

చిరంజీవిగారిని అందుకే పిలవలేదు: నిహారిక

By:  Tupaki Desk   |   21 Nov 2021 9:34 AM GMT
చిరంజీవిగారిని అందుకే పిలవలేదు: నిహారిక
X
నిహారిక మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్. యాంకర్ గా .. హోస్ట్ గా బుల్లితెరపై తన ప్రత్యేకతను చాటుకుంది. ఆ తరువాత ఒక వైపున తన సొంత బ్యానర్ పై వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ, మరో వైపున కొన్ని సినిమాలో కథానాయికగా సందడి చేసింది. వివాహమైన తరువాత ఆమె మళ్లీ ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. తాజాగా ఆమె నిర్మించిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఆమె తన టీమ్ తో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ చిరంజీవిని గురించి ప్రస్తావించింది.

'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ లాంచ్ కి చిరంజీవిగారిని ఎందుకు పిలవలేదు?' అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు నిహారిక మాట్లాడుతూ .. "అడిగితే పెదనాన్న 'నో' అనరు. నిజానికి ఆయన చాలా బిజీ. నేను అడిగితే పెదనాన్నగానీ .. బాబాయ్ గాని కాదనరు. కానీ వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ వెబ్ సిరీస్ ను పెదనాన్న చూశారు .. నచ్చిందని చెప్పారు. పెదనాన్న గారిని నేను 'డాడీ' అనే పిలుస్తాను. ఎందుకంటే మా అన్నయ్య వాళ్లింట్లోనే పెరిగాడు. తను డాడీ అని పిలిచేవాడు .. దాంతో నేను కూడా అలాగే పిలవడం అలవాటైపోయింది.

'మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓటీటీగా 'ఆహా' ఉండగా, 'జీ 5కి ఎందుకు ఈ వెబ్ సిరీస్ ఇవ్వవలసి వచ్చింది'? అనే ప్రశ్న నిహారికకు ఎదురైంది? అందుకు ఆమె స్పందిస్తూ .. "ఆహా కి ఇస్తే అయినవాళ్లు కాబట్టి అంటారు .. పక్కవాళ్లకి ఇస్తే వేరేవాళ్లకి ఎందుకు ఇచ్చారంటారు? నిజానికి నేను గతంలో చేసిన రెండు వెబ్ సిరీస్ లు 'ముద్దపప్పు ఆవకాయ్' .. 'నాన్నకూచి' జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' కంటెంట్ విషయంలో వారి సూచనలు తీసుకున్నాము. అందువలన ఇది కూడా వాళ్లకే ఇవ్వడం జరిగింది" అని చెప్పుకొచ్చింది.

ఇక నేనేం చేసినా చెప్పి చెయ్యాలి అనే లిమిట్స్ మా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ పెట్టలేదు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఇండస్ట్రీనే కావడం వలన నాకు తగినంత స్వేచ్ఛ ఉంది. ఇదే విషయాన్ని మా అన్నయ్య వరుణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు కూడా. నేను పడాలి .. నేను లేవాలి .. నా తప్పుల నుంచి నేను నేర్చుకోవాలి. ఒక సినిమాకి ఎంతగానైతే కష్టపడతామో అంతేలా ఈ వెబ్ సిరీస్ కి కష్టపడ్డాము. అందువలన ఇది ఒక సినిమాను చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఈ కథకి ఒక సినిమాకి ఎంత ఖర్చు అవుతుందో .. వెబ్ సిరీస్ కూడా అంతే ఖర్చు పెట్టాము. సంగీత్ శోభన్ .. దర్శకుడు మహేశ్ తో త్వరలో మరో రెండు ప్రాజెక్టులు ఉంటాయి" అని చెప్పుకొచ్చింది.