Begin typing your search above and press return to search.

నిహారికతో ఎఫైర్.. ఆమె ఖండించింది

By:  Tupaki Desk   |   26 Oct 2017 4:45 AM GMT
నిహారికతో ఎఫైర్.. ఆమె ఖండించింది
X
సాధారణంగా బాలీవుడ్ పేరు చెప్పగానే వెలుగు జిలుగుల తారాలోకంతోపాటు నటీనటుల రహస్య ప్రేమాయణాలు.. వియోగాలు.. చాటుమాటుగా సాగే ప్రేమకథలెన్నో కూడా వినిపిస్తాయి. బాలీవుడ్ లో ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రేమ కథ కూడా ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. తాజాగా నవాజుద్దీన్ ఓ పుస్తకం రాశాడు. యాన్ ఆర్డినరీ లైఫ్: ఎ మెమైర్ పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన మాజీ గర్ల్ ఫ్రెండ్ నిహారిక సింగ్ తనకు ఎలా దగ్గరై.. ఆనక దూరమైందీ రాసుకొచ్చాడు.

నవాజుద్దీన్ - నిహారికా సింగ్ కలిసి అప్పట్లో మిస్ లవ్ లీ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట. ఓసారి నిహారికను తన ఇంటికి భోజనానికి పిలిచానని... ఆ తర్వాత ఆమె తనను ఇంటికి ఆహ్వానించిందని చెప్పుకొచ్చాడు. ఆ రోజు వందలాది క్యాండిళ్ల మధ్య మెరుపుతీగలా తనకు స్వాగతం పలికిందని.. అట్నుంచి అటే ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లానని... అప్పట్నుంచి ఏడాదిన్నర పాటు తమిద్దరి మధ్య గాఢమైన లవ్ కంటిన్యూ అయిందన్నాడు. నిహారిక కన్నా ముందు న్యూజెర్సీకి చెందిన అమ్మాయి సుజానేను ప్రేమించానని... ఈ విషయం తెలిసి నిహారిక తమ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి ఎంతో ప్రయత్నించిదని కూడా తన బుక్ లో రాశాడు.

తన ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎంతో రొమాంటిక్ గా ఉండేలా నవాజుద్దీన్ బుక్ లో రాశాడు. అయితే అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిహారిక మాత్రం అవన్నీ పిచ్చిరాతలని కొట్టిపారేసింది. తన గురించి రాసేటప్పుడు కనీసం తన పర్మిషన్ కూడా తీసుకోలేదని కోప్పడిపోయింది. నవాజుద్దీన్ గొప్ప నటుడని ఒప్పుకుంటానని... కానీ తాను రాసిన పుస్తకం అమ్ముకోవడానికి ఛీప్ ట్రిక్స్ కు దిగాడని కామెంట్ చేసింది. లేని రొమాన్స్ ను పుస్తకంలో జొప్పించాడని... అతడికి స్త్రీలను గౌరవిండచం కూడా రాదని తేల్చిచెప్పింది.