Begin typing your search above and press return to search.
స్వీట్ సిగరెట్ ప్యాకెట్! మెగా ప్రిన్సెస్ ఏంటిలా?
By: Tupaki Desk | 16 July 2021 11:30 AM GMTమెగా డాటర్ నిహారిక తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భర్త చైతన్య సహకారంతో నటవృత్తిని హ్యాపీగా లీడ్ చేస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందని భావించినా ఇరుకుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉండటంతో ప్రొఫెషనల్ కెరీర్ కి అడ్డంకులు తొలగిపోయాయి.
ప్రస్తుతం నిహారిక ఓ రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. స్వీయ నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆన్ సెట్స్ లో మెగా డాటర్ కి సంబంధించిన ఓ షాకింగ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. సెట్స్ లో చేతిలో సిగరెట్ ప్యాకెట్ తో దర్శనమిచ్చింది. స్వీట్ సిగరెట్! అంటూ ఓ క్యాప్యన్ తో ఫోటోని ఇన్ స్టా లో షేర్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చారు.
క్రేజీగా ఉంటుందని అలా సిగరెట్ పెట్టెతో ఫోజు ఇవ్వలేదు సుమీ...కేవలం షూట్ లో భాగంగా సీన్ డిమాండ్ చేయడంతో అలా కనిపించారు అంతే... నిజానికి ఇది స్వీట్ మింట్ క్యాండీ చాకొలెట్. పొగ తాగేది కానేకాదు. కేవలం చూడటానికి సిగరెట్ ప్యాకెట్ లా ఉంటుంది అంతే. అందుకే స్వీట్ సిగరెట్ అని నిహారిక క్లారిటీగా చెప్పేశారు. ప్రస్తుతం నిహారిక చేతిలో సినిమాలు లేనప్పటికి మంచి అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది.
నిహారిక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సెలబ్రేషన్..
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గుంటూరు ఐజీ వారసుడు టెకీ చైతన్య జొన్నలగడ్డను 2020 డిసెంబర్ 9న వివాహమాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. పెళ్లి సందడికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం విహార యాత్రకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని ఫోటోల్ని నిహారిక స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. నిహారిక తన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన ప్రతి ఆనందకర క్షణాలను సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తున్నారు. ఇంతకుముందు అల్లుడికి నాగబాబు ఖరీదైన కార్ ని గిఫ్ట్ గా ఇచ్చినప్పటి ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
నిజానికి పెళ్లి సమయంలో నిహారిక తన కెరీర్ ని కొనసాగిస్తుందా? ఒక ఇంటికి కోడలిగా వెళ్లాక ఇంట్లో అడ్డు చెబుతారా? అంటూ రకరకాల సందిగ్ధతలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి. కానీ అన్నిటినీ పటాపంచలు చేస్తూ పెళ్లి తర్వాత నటిగా కెరీర్ ని సాగించడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. మెగా ప్రిన్సెస్ నటిగా నిర్మాతగా ఉన్నత శిఖరాలకు చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిహారిక తదుపరి సొంత నిర్మాణ సంస్థను ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనతో ఉన్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి.