Begin typing your search above and press return to search.

మెగావారమ్మాయి ఓకే చేసిందా?

By:  Tupaki Desk   |   24 Sep 2015 4:33 AM GMT
మెగావారమ్మాయి ఓకే చేసిందా?
X
బుల్లితెరపై సందడి చేస్తున్న నాగబాబు కుమార్తె నీహారిక.. త్వరలో సిల్వర్ స్క్రీన్ పైనా కనిపించబోతున్నట్లు టాలీవుడ్ టాక్. హీరోయిన్ గా ఎదగాలని ఈమెకు ఎప్పటినుంచో కోరిక ఉన్నా.. కుటుంబం నుంచి మద్దతు లభించలేదు. తండ్రి నుంచి కూడా సపోర్ట్ లభించకపోవడంతో.. ఇప్పటికైతే టీవీ షోల్లో యాంకరింగ్ తో నెట్టుకొచ్చేస్తోంది.

మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు చిత్రంతో ఇండస్ట్రీని ఆకర్షించిన డైరెక్టర్ రామరాజు.. రీసెంట్ గా నాగేంద్రబాబును కలిసి ఓ స్టోరీ చెప్పాడట. ఈ కథలో హీరోయిన్ పాత్రకు నీహారిక సరిగా సరిపోతుందని వివరించాడట. స్టోరీ లైన్, హీరోయిన్ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ చూసిన నాగబాబు.. మొత్తానికి ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. ఈ మూవీలో ఇప్పటికే నాగశౌర్యను హీరోగా కన్ఫాం చేసుకున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం.. పూర్తి స్థాయి లవ్ స్టోరీయే అని తెలుస్తోంది. ఓ టాప్ న్యూస్ ఛానల్ తో కలిసి.. మధుర శ్రీధర్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కనుండడం విశేషం.

ఎన్నాళ్లగానో హీరోయిన్ అవుదామని ఎదురుచూస్తున్న నీహారిక.. హీరోయిన్ ఓరియెంటెడ్ స్టోరీలో అయినా నటించాలని అనుకుంటున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే యూత్ హీరో నాగశౌర్య పక్కన లవర్ గా తెరంగేట్రం చేయనుండడం విశేషమే. అయితే,. ఈ ప్రాజెక్టులో నీహారిక ఎంట్రీ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అప్పటికిగానీ ఈ మెగా డాటర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫాం అయినట్లు కాదు.