Begin typing your search above and press return to search.

అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక వివాహం..!

By:  Tupaki Desk   |   9 Dec 2020 5:02 PM GMT
అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక వివాహం..!
X
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక ఈ రోజు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడిచింది. కొణిదెల నిహారిక కాస్తా జొన్నలగడ్డ ఫ్యామిలీ కోడలిగా మారిపోయింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో ఈ వివాహం వైభవంగా జరిగింది. నవవధూవరులు సంప్రదాయ వస్త్రాలతో ముస్తాభై కనిపిస్తున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్, వరుణ్ తేజ్ లతో పాటు మొత్తం మెగా ఫ్యామిలీ హాజరైంది.


కూతురి వివాహం చూసి భావోద్వేగానికి లోనైన నాగబాబుట్విటర్‌ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంది'' అని నాగబాబు ట్వీట్ చేశారు. అంతేకాకుండా పెళ్లి కూతురుగా ముస్తాభైన నిహారిక ఫోటోను కూడా షేర్ చేసాడు.