Begin typing your search above and press return to search.
ఇక చాలు.. రెస్ట్ తీసుకోండి.. నిహారిక పెళ్లి వీడియోలపై..
By: Tupaki Desk | 27 Jan 2021 1:30 AM GMTమెగా డాటర్ నిహారిక వివాహం ఎంత వైభవంగా జరిగిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకను.. మీడియా కూడా భారీ ప్రయారిటీతో కవర్ చేసింది. ఇక సోషల్ మీడియాలో నిహారిక పెళ్లి ఫొటోలు ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టాయి.
నంబర్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్ కూడా వచ్చాయి. పెళ్లికి రెండు మూడు రోజుల నుంచే మొదలైన హంగామా.. పెళ్లి తర్వాత కూడా కొనసాగింది. ఆ తర్వాత కొత్త జంట హనీమూన్ ట్రిప్.. మాల్దీవుల్లో సందడి గురించి కూడా బాగానే చర్చ జరిగింది.
ఇక, మెగా బ్రదర్ నాగబాబు తన కూతురి పెళ్లి వీడియోల కోసం ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానెల్ నే క్రియేట్ చేశారు. ఆ ఛానెల్‌లో ఈ రిచ్ వెడ్డింగ్ వీడియోస్ ను పోస్ట్ చేస్తూ వచ్చారు. ఆ తరువాత.. అవి నిహారిక ఇన్‌స్టా అకౌంట్లో ప్రత్యక్షమవుతున్నాయి. లేటెస్ట్ గా కూడా మరో వీడియో షేర్ చేసింది నిహారిక.
ఈ వీడియోలను చూస్తున్న అభిమానులు, నెటిజన్లు.. కొత్త జంట సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా.. ఈ పెళ్లి వీడియోలు, ఫొటోల విషయంలో 'కాస్త రెస్ట్ తీసుకోండి' అని సూచిస్తున్నారు.
ఈ వివాహం ద్వారా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే వేదికపై సందడి చేసింది. ఇది నిస్సందేహంగా మెగా ఫ్యామిలీకి మాత్రమే కాకుండా.. మెగా ఫ్యాన్స్ కు కూడా ఎంతో ప్రత్యేకమైన అంశమే. కానీ.. పెళ్లయి నెల రోజులు గడిచిన తర్వాత కూడా ఈ ఫొటోలు, వీడియోల పరంపర కొనసాగుతుండడంతో ఇక ఆపండి ప్లీజ్ అంటోంది సోషల్ మీడియా. మరి, ఈ ఫీడ్ బ్యాక్ తో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.