Begin typing your search above and press return to search.

నిజం విత్ స్మిత‌: టాప్ సెల‌బ్రిటీల‌తో మ‌రో బోల్డ్ ఎటెంప్ట్!

By:  Tupaki Desk   |   2 Feb 2023 10:30 PM GMT
నిజం విత్ స్మిత‌: టాప్ సెల‌బ్రిటీల‌తో మ‌రో బోల్డ్ ఎటెంప్ట్!
X
సినీరంగంలో స్టార్లు ప్ర‌ముఖుల‌తో క‌ర‌ణ్ జోహార్ `కాఫీ విత్ క‌ర‌ణ్‌` ఎంత పెద్ద స‌క్సెసైందో తెలిసిందే. ఆ త‌ర్వాత దీనికి చాలా అనుక‌ర‌ణ‌లు వ‌చ్చాయి. ఇక ఆహా తెలుగు ఓటీటీలో అన్ స్టాప‌బుల్ విత్ NBK షోకి ఎలాంటి ఆద‌ర‌ణ ద‌క్కిందో తెలిసిందే. బాల‌య్య స్పాంటేనియాసిటీ ఆయ‌న‌లోని హ్యూమ‌ర‌సం జ‌నాల‌కు బాగా ఎక్కింది. సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో ఇంటర్వ్యూలు కిక్కు పుట్టించాయి. దీంతో `ఆహా`లో సెల‌బ్ షో పెద్ద స‌క్సెసైంది. ఇంత‌కుముందు రానా హోస్టింగ్ చేసిన‌ `నంబ‌ర్ వ‌న్ యారీ` ఈ త‌ర‌హానే.

ఇప్పుడు `నిజం విత్ స్మిత` ఈ త‌ర‌హా ప్ర‌య‌త్న‌మే. దేవా కట్టా సమర్పణలో నిజమ్ విత్ స్మిత టాక్ షోను పాప్ స్టార్ స్మిత హోస్టింగ్ తో ప్రారంభించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా స్మిత స్వ‌యంగా షోని నిర్మిస్తున్నారు. తాజాగా షో ప్రోమో విడుద‌లైంది. ఇందులో స్మిత‌ బోల్డ్ ప్రశ్నలకు సెల‌బ్రిటీలు సమాధానాలివ్వ‌డం క‌నిపిస్తోంది.

`నిజం విత్ స్మిత` ప్రోమో ఆద్యంతం వివిధ రంగాల‌కు చెందిన‌ టాప్ సెల‌బ్రిటీలు క‌నిపించారు. స్మిత బోల్డ్ గా ప్రశ్నలు అడగడం అతిథులు వాటికి సమాధానాలివ్వ‌డం చూస్తుంటే షోలో చాలా దాగుడు మూత‌ల క‌థ‌లు ఓపెన‌వుతాయ‌ని వాస్త‌వాలు వెల్ల‌డ‌వుతాయ‌ని భావిస్తున్నారు. ఈ షో ఈ నెల 10 నుండి సోనీ LIVలో ప్రసారం కానుంది.

స‌ద‌రు స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో ఇది మొదటి తెలుగు షో. తాజా ప్రోమోలో చంద్రబాబు నాయుడు- చిరంజీవి- రానా దగ్గుబాటి- నాని- సాయి పల్లవి- అల్లరి నరేష్-అనీల్ రావిపూడి- అడివి శేష్- మేజర్ భరత్ రెడ్డి త‌దిత‌రులు అతిథులుగా క‌నిపించారు. ఇంకా చాలా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో స్మిత షో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం. షోకి విచ్చేసే అతిథికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌శ్న‌లు ఉంటాయి. స‌మాధానాల్లో ఫ్యాక్ట్ ఎంత అనేది ప్రేక్ష‌కులే నిర్ణ‌యిస్తారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.