Begin typing your search above and press return to search.

పెళ్లి వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   26 Oct 2022 11:30 AM GMT
పెళ్లి వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్ హీరోయిన్..!
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'కొమురంపులి' మూవీతో నికీషా పటేల్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ మూవీలో నికీషా పటేల్ అందచందాలకు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన అమ్మడికి మాత్రం ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఓం త్రీడీ.. గుంటూరు టాకీస్-2 సినిమాల్లోనూ కన్పించింది.

ఈ సినిమాలేవీ నికీషా పటేల్ కు స్టార్డమ్ తీసుకు రాలేకపోయాయి. ఈ సమయంలోనే ఈ బ్యూటీకి తమిళ, కన్నడ సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావడంతో టాలీవుడ్ కి పూర్తిగా దూరమైంది. అయితే అక్కడ కూడా ఆమెకు సరైన హిట్స్ రాలేదు. దీంతో ఈ భామ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి విదేశాలకు వెళ్లి పోయింది.

నికీషా పటేల్ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. అభిమానులతో టచ్ లో ఉంటూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటోంది. కాగా ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ఫ్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' మూవీ తనకు నచ్చలేదని చెప్పి వార్తల్లో నిలిచింది.

ఇదిలా ఉంటే ఈ భామ ఓ విదేశీయుడితో పికల్లోతు లవ్ ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు పెళ్లి కొడుకు ఎవరా? అనే ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా నికీషా పటేల్ ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేసింది.

దీంతో నికీషా పటేల్ కు కాబోయే భర్త అతడేనా? అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫోటోను మంగళవారం సాయంత్రానికి డిలీట్ చేసింది. దీంతో ఆమెకు కాబోయే భర్త అతడేనా? కాదా? అన్న చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. తాజాగా ఈ విషయంపై నికీషా పటేల్ క్లారిటీ ఇచ్చింది.

తన పెళ్లిపై మీడియాలో వచ్చిన వార్తలన్నీ కూడా అవాస్తమని పేర్కొంది. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను తన ఇన్ స్ట్రాలో జోడించి 'False News' అంటూ చెప్పింది. అయితే తనతో ఉన్న ఆ విదేశీయుడు ఎవరా? అనేది మాత్రం చెప్పలేదు. ఇక చివరగా నికీషా పటేల్ 2019లో వచ్చిన 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' మూవీలో నటించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.