Begin typing your search above and press return to search.

అందం చూడవయా.. ఆనందించవయా

By:  Tupaki Desk   |   8 May 2017 11:30 AM GMT
అందం చూడవయా.. ఆనందించవయా
X
అందచందాలు పుష్కలంగా ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడం అంటే ఏమిటన్నది నికిషా పటేల్ ను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి ‘కొమరం పులి’ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అందాల ఆరబోతలోనూ పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు. కొమరం పులి బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఎంత ప్రయత్నించినా ఛాన్సులు రాకపోవడంతో ఇక్కడ నుంచి కన్నడ సీమకు షిఫ్టయిపోయింది. దాంతోపాటు తమిళంలోనూ ఒకటి, రెండు ఛాన్సులు వస్తుండటంతో ఏదో అలా... అలా కెరీర్ ను నెట్టుకొస్తోంది.

ఇంతవరకు తన ఖాతాలో బంపర్ హిట్ అంటూ ఏదీ లేకపోవడంతో నికిషా తన అందాల ఆరబోత డోసును మరికొంత పెంచేందుకు సిద్ధమవుతోంది. అందుకే ఇటీవల మత్తెక్కించే ఫోజులతో బికినీ షూట్ చేసింది. బికినీలో తన అందాలను చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో అభిమానులకు సందేశం కూడా ఇచ్చింది. ఈ బికినీ షూట్ కూడా ఆషామాషీగా కాకుండా బోలెడు ఎక్సర్ సైజ్ లు అవీ చేసి కాస్త స్లిమ్మయి మరింత గ్లామర్ గా తయారై మరీ పూర్తి చేసిందంట. ముందుగా కాస్త శాంపిల్ చూడమంటూ ఓ ఫొటో బయటకు వదిలింది.

కొమరం పులి తర్వాత ఇటీవల మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుందామని సాయిరాం శంకర్ హీరోగా నటించిన అరకు రోడ్ లో సినిమాతో తెలుగు తెరపై కనిపించింది నికిషా. అదేమిటో ఆ సినిమా ఎప్పుడొచ్చిందీ... ఎప్పుడు వెళ్లిపోయిందీ ప్రేక్షకుడికి గుర్తులేదు. అందుకే ఈసారి ప్రేక్షకులకు గుర్తుండేలా అందాల ప్రదర్శనకు సిద్ధమైందన్నమాట. అదీ సంగతి.