Begin typing your search above and press return to search.

నాకా..ఆయనతో పెళ్లా?

By:  Tupaki Desk   |   13 May 2018 4:59 PM GMT
నాకా..ఆయనతో  పెళ్లా?
X
కొన్నిసార్లు సరదాకు అనే మాటలే సీరియస్ అయిపోతుంటాయి. జనాలు ఆ వ్యాఖ్యల్ని మరోలా అర్థం చేసుకుంటారు. వ్యవహారం తేడా కొట్టేస్తుంది. ‘పులి’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన నికీషా పటేల్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు అలాగే మారాయి. ప్రభుదేవా అంటే తనకు ఇష్టమని.. ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ నికీషా సరదాకి చేసిన వ్యాఖ్యలు సీరియస్ అయ్యాయి. ప్రభుదేవాతో నికీషా పెళ్లట అంటూ ప్రచారం జరిగే వరకు పరిస్థితి వెళ్లిపోయింది. దీంతో ఈ విషయమై నికీషా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ప్రభుదేవా గురించి తాను అన్న మాటలపై చాలా వార్తాలు పుట్టుకొస్తున్నాయని... వీటిపై ఓ క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని... ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. తాను తన కుటుంబంతో చాలా బిజీగా ఉన్నానని ట్వీట్ చేసింది నికీషా. ‘‘నేను ప్రభుదేవానే కాదు.. ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన నాకు మంచి స్నేహితుడు.. శ్రేయోభిలాషి మాత్రమే. నేను ప్రభుదేవాను సర్‌ అని పిలుస్తాను’’ అని నికీషా అన్నట్లుగా ఆమె పీఆర్వో కూడా ఒక ప్రకటన ఇచ్చారు. ప్రభుదేవా మీద ఉన్న అభిమానం.. గౌరవంతోనే నికీషా ఆ వ్యాఖ్యలు చేసింది తప్ప అంతకుమించి ఏమీ లేదని పీఆర్వో చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభుదేవాతో నటిస్తారా అని నికీషాను అడిగితే.. ‘‘సినిమా చేయడమేంటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికైనా రెడీ’’ అని నికీషా పటేల్‌ అనడంతో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్న ఒక ఫొటో కూడా బయటికి రావడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.