Begin typing your search above and press return to search.
బికినీ కోసం.. ఎంత విశాల హృదయమో
By: Tupaki Desk | 19 Nov 2015 5:30 PM GMTసినిమా ఇండస్ట్రీలోను, గ్లామర్ రంగంలోను ఎక్స్ పోజింగ్ సర్వ సాధారణం. ఎంత ఎక్కువగా విచ్చలవిడిగా అందాలు పారబోస్తే... అంత ఎక్కువగా ఆఫర్స్ తలుపు తడతాయన్నది తిరుగులేని వాస్తవం. అయితే.. చాలామంది పెళ్లి దగ్గరకి వచ్చేసరికి అన్నిటినీ కట్టేస్తుంటారు. వీలైనంతవరకూ పద్ధతిగా ఉండే పాత్రలతో సరిపెట్టుకుంటారు. ఇందుకోసం వాళ్ల క్రేజ్ ని కూడా కాదనుకోవాల్సి వస్తుంది. అయినా సరే పిల్లలకు తాము చెడ్డగా అనిపించకుండా ఉండేందుకు ఇలా అవతారం మార్చేస్తుంటారు.
కానీ ఓ హీరోయిన్ మాత్రం సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన పిల్లలకు తన అందమైన బాడీని చూపిస్తానంటోంది. కొమరం పులి మూవీతో పవన్ కళ్యాణ్ పక్కన సందడి చేసిన నికీషా పటేల్ కి ఇప్పుడు అవకాశాలు కొంచెం తగ్గినా, క్రేజ్ మాత్రం బాగానే ఉంది. దీనికి అమ్మడి బాడీ, బికినీ షోలే ప్రధాన కారణం. ఇలా స్కిన్ షో చేసి ఆఫర్స్ తెచ్చుకోవడంలో తప్పు లేదంటోంది నికీషా. 'ఇప్పుడు బీచ్ లో ఉంటే బికినీ వేసుకుంటాం. అక్కడ తప్పేం అనిపించదు కదా. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా. ఇక్కడ ఏం కావాలో అవి చూపించాలి. అందుకోసం బికినీ వేసుకోవడానికి నేనేం ఇబ్బంది పడను. ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లు పోయాక.. నా పిల్లలకు అప్పుడు వాళ్లమ్మ ఎలా ఉండేదో చూపిస్తా'నంటూ చెప్పింది నికీషా పటేల్. ఇలా పిల్లలకు తన అందాల ఆరబోత గురించి, సౌందర్యం గురించి చూపిస్తానని చెప్పగలగడానికి చాలా గట్స్ ఉండాలి.
అయితే.. తనకు పులిలో నటిస్తున్నప్పుడు పెద్ద బ్యానర్స్, స్టార్ హీరోల నుంచి చాలానే అవకాశాలు వచ్చాయని.. కానీ రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయని చెప్పింది నికీషా. కానీ ఇలా జరిగినందుకు మాత్రం తనేం బాధ పడ్డం లేదుట. అంతేలెండి అంత విశాల హృదయంలో ఇలాంటి వాటికి ప్లేస్ ఉంటుందా మరి !