Begin typing your search above and press return to search.
పవన్ హీరోయిన్ ఇలా అనేసిందేంటి?
By: Tupaki Desk | 10 May 2018 6:41 AM GMTస్టార్ హీరోలతో నటిస్తే హిట్టు రాకపోయినా కనీసం క్రేజ్ వస్తుంది అని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు. అందుకే కథ కథనం విషయాలను పక్కనపెట్టి మొదట స్టార్ట్ హీరోలతో చేసే అవకాశం వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. కానీ సినిమా హిట్ అవ్వకుంటే ఆఫర్స్ రావచ్చు రకపోవచ్చు. మొదటి సినిమాతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరోయిన్స్ పెద్దగా పాపులర్ అవ్వలేదు. అలాంటిది డిజాస్టర్స్ అందుకున్న బేబీలు కూడా సక్సెస్ అవ్వలేదు. అయినా కూడా కొందరి ప్రయత్నాలు ఏ మాత్రం ఆపడం లేదు.
అలాంటి వారిలో నికిషా పటేల్ ఒకరు. అమ్మడు మొదటి సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎస్ జె.సూర్య - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన కొమరం పులి ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో నికిషాకి కూడా పెద్దగా ఆఫర్స్ ఏమి రాలేవు. కానీ ప్రయత్నాలు బాగానే చేసింది. కోలీవుడ్ లో కొన్ని చిన్న తరహా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ని ఓ లెవెల్లో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నట్టు చెబుతోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు ఎవరు ఊహించని విధంగా చేసిన కామెంట్స్ అందరిని షాక్ కి గురి చేసింది. ప్రభుదేవ అంటే తనకు ఎంతో ఇష్టమని తనకు తన ఫ్యామిలీ కి మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పింది.
ఇక ఆయనతో నటిస్తారా? అనే విషయం పై స్పందిస్తూ.. "మీరు ప్రభుదేవతో నటిస్తారా అని అడుగుతున్నారా? కానీ నేను ఆయనను ఏకంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా" అని ఘాటుగా సమాధానం ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ గా మారింది. అమ్మడు సడన్ గా ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందని అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇంతకుముందే ప్రభుదేవా మొదటి భార్యతో విడాకులు తీసుకొని నయనతార తో ప్రేమను కొనసాగించిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నా ఆ న్యూస్ అక్కడి వరకే ఎండ్ అయ్యింది. మరి ఇప్పుడు కొత్తగా నికిషా కామెంట్స్ సరికొత్త అనుమానాలను రేపుతున్నాయి.