Begin typing your search above and press return to search.
శ్రీశాంత్ రెండవ పెళ్లి.. పవన్ హీరోయిన్ ఆగ్రహం
By: Tupaki Desk | 14 Oct 2018 4:33 AM GMTహిందీలో బిగ్ బాస్ షో ఇప్పటి వరకు 11 సీజన్ లు పూర్తి చేసుకుని, సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అదే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 12వ సీజన్ జరుగుతుంది. ఈమద్యే ప్రారంభం అయిన ఈ సీజన్ లో టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఉండటంతో అంతా కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తో కెరీర్ ను నాశనం చేసుకుని, జైలుకు కూడా వెళ్లి వచ్చిన శ్రీశాంత్ బిగ్ బాస్ 12వ సీజన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈయన ఇంట్లో ఎంటర్ టైన్ చేయడంతో పాటు, అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈయన తన వివాహ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన జాతకంలో రెండవ పెళ్లి రాసి పెట్టి ఉందని, నేను రెండవ పెళ్లి చేసుకునేందుకు నా భార్య భువనేశ్వరి కూడా ఒప్పుకుందని ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. అయితే నేను రెండవ పెళ్లి నాకు 75 ఏళ్లు వచ్చాక చేసుకుంటాను అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. నా భార్యతో వివాహానికి ముందు ఏడు సంవత్సరాల పాటు ప్రేమను కొనసాగించానని, ఆమె అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె నా జీవితంలోకి రావడం నా అదృష్టంగా ఎప్పటికి భావిస్తాను అంటూ శ్రీశాంత్ ఇంటి సభ్యులతో చెప్పడం బిగ్ బాస్ అన్ సీన్ లో చూపించారు.
శ్రీశాంత్ తన భార్యతో పెళ్లికి ముందు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా చెప్పడంను పవన్ హీరోయిన్ నికిషా పటేల్ తప్పుపట్టింది. నికిషా మాట్లాడుతూ.. నాకు శ్రీశాంత్ మాటలు ఆశ్చర్యంను కలిగించాయి. భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి ఏడాదికి ముందు వరకు నాతో డేటింగ్ లో శ్రీశాంత్ ఉన్నాడు. పెళ్లికి ముందు మా రిలేషన్ షిప్ బ్రేకప్ అయ్యింది. అలాంటి సమయంలో భువనేశ్వరితో పెళ్లికి ముందు ఏడేళ్లుగా ప్రేమ ఉందని ఎలా చెబుతున్నాడో నాకు అర్థం కావడం లేదు అంటూ నికిషా పేర్కొంది. పదే పదే బిగ్ బాస్ షోలో తన భార్య భువనేశ్వరి గురించి శ్రీశాంత్ ఎందుకు వివాదం చేయాలని చూస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. శ్రీశాంత్ సెంటిమెంట్ తో షోలో నెట్టుకు రావాలని ప్రయత్నిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది.