Begin typing your search above and press return to search.
వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారబ్బా
By: Tupaki Desk | 2 Aug 2017 12:43 PM GMTటాలీవుడ్లో చాలామంది హీరోలు ఒకరితో ఒకరు క్లోజుగానే ఉంటారు. అయితే అందులో కొంతమంది తమకంటే స్థాయి పెద్ద హీరోలతో క్లోజుగా మెదులుతుంటారు.. ఎందుకో తెలిసిందే. కొందరు కావాలనే వయస్సులో యంగ్ హీరోలతో స్నేహం చేస్తుంటారు..వారి వయస్సు తగ్గించుకోవడానికి కాబోలు. అయితే ఓ ఇద్దరు కుర్ర హీరోలు మాత్రం వారి స్నేహంతో చాలా ఇంప్రెస్ చేస్తున్నారు. అయితే అసలు వీరు ఇంత క్లోజ్ ఎలా అయ్యారు అనేదే సందేహం.
దగ్గుబాటి రానా నిర్వహిస్తున్న నెం.1 యారీ అనే టివి షో కోసం.. సెలబ్రిటీల్లో ఉన్న దోస్తులను పిలుస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు నిఖిల్ మరియు రాజ్ తరుణ్ కలసి వచ్చారు. ఈ ఇద్దరికీ ఉన్న ఒకేఒక్క స్పెషాలిటీ ఏంటంటే.. ఇద్దరూ కూడా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీకి వచ్చేసి ఇక్కడ పెద్ద హీరోలు అయిపోయారు. ఇద్దరూ కూడా హ్యాపెనింగ్ హీరోలు అయిపోయారు. అయితే తమ మధ్యన కుదిరిన స్నేహం గురించి చెబుతూ.. గతంలో తన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా రిలీజైనప్పుడు.. నేను నా సినిమా సక్సెస్ అయ్యింది అనేదానికంటే.. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రాజ్ తరుణ్ ఇస్తున్న పార్టీల గురించే ఎక్కువగా విన్నానని.. అలా మేం మాంచి దోస్తులం అయిపోయాం అన్నాడు నిఖిల్.
ఇక రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. తనకు ఇండస్ర్టీలో పెద్దగా స్నేహితులు ఎవ్వరూ లేరని.. అసలు ఎవ్వరూ తెలియదని.. కాని ఎందుకో నిఖిల్ తో అలా కుదిరిపోయిందని.. ఇద్దరం కూడా మాంచి సింక్ లో ఉంటాం అని చెబుతున్నాడు. కలకాలం ఇద్దరూ ఇలా స్నేహితులుగానే ఉంటాం అంటున్నారు.