Begin typing your search above and press return to search.
సెంటిమెంట్ కూరుతున్న నిఖిల్
By: Tupaki Desk | 24 March 2019 4:39 AM GMTఇటీవల చాలా సినిమాలు వాయిదా పద్ధతిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో యువహీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం రకరకాల కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రానికి తొలుత ముద్ర అనే టైటిల్ నిర్ణయించారు. ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించిన వేరొక ప్రొడక్షన్ కంపెనీ ససేమిరా అనడంతో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయి. కారణం ఏదైనా అర్జున్ సురవరం టైటిల్ ని ప్రకటించి తదుపరి ప్రచారంలో వేడి పెంచేందుకు నిఖిల్ టీమ్ ప్రయత్నించారు.
మార్చి 29న `అర్జున్ సురవరం` రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ చిత్రాన్ని మే 1కి వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా సినిమాల్లో వాయిదా పద్ధతిలో రిలీజైనవి సూపర్ హిట్లు కొట్టాయి. కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా? వాయిదా పడే వచ్చాయి.. సూపర్ హిట్లు కొట్టాయి. ఈసారీ అలానే జరుగుతోంది. అర్జున్ సురవరం సూపర్ హిట్ కొడుతుంది' అని వ్యాఖ్యానించారు.
అర్జున్ సురవరం లో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో బాధ్యతాయుతమైన జర్నలిస్టు పాత్రలో నటించాను. అలాంటి పాత్రలో నటించడం సాహసంతో కూడుకున్నది. అలాగే ఇందులో మీడియా గురించి పాజిటివ్ విషయాలతో పాటు నెగెటివ్ విషయాల్ని చర్చించామని తెలిపారు. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ `కణిథాన్` కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మాతృకను తెరకెక్కించిన టి.ఎన్.సంతోష్ తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించారు. ఠాగూర్ మధు సమర్పణలో ఆరా సినిమాస్- మూవీ డైనమిక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.