Begin typing your search above and press return to search.

ఆ రహస్య ప్రదేశంలో నిఖిల్

By:  Tupaki Desk   |   25 Aug 2017 5:08 AM GMT
ఆ రహస్య ప్రదేశంలో నిఖిల్
X
బాహుబలి లాంటి సినిమా థియేటర్లలో ఉండగా థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సినిమా కేశవ. హీరో నిఖిల్ ఈ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు. మామూలు రివెంజ్ డ్రామాను ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సుధీర్ వర్మ బాగానే సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో నిఖిల్ ప్రస్తుతం కన్నడ సినిమా కిరాక్ పార్టీ రీమేక్ లో చేస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో నిఖిల్ ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నాడనే టాక్ టాలీవుడ్ లో తెగ షికారు చేసింది. దీనిపై నిఖిల్ మాత్రం పెదవి విప్పలేదు. అయితే ఉన్నట్టుండి ఫారిన్ టూర్ వెళ్లి సోషల్ మీడియాలో తన టూరుకు సంబంధించిన ఫొటోలు అప్ డేట్ చేశాడు. నిఖిల్ తన టూర్ లో భాగంగా ఇంగ్లండ్ లోని పురాతన కట్టడమైన స్టోన్ హెంజ్ కు వెళ్లాడు. ప్రపంచంలో కొన్ని మిస్టరీల గుట్టు తెలియకుండా అలాగే ఉండిపోతుంది. ఈ స్టోన్ హెంజ్ కూడా అలాంటిదే. 4,500 ఏళ్ల నాటి ఈ కట్టడం వెనుక రహస్యం ఏమిటో ఇప్పటికే బయట ప్రపంచానికి తెలియలేదు. ‘ప్రపంచంలో అతిపెద్ద అన్ సాల్వుడ్ మిస్టరీ... 4500 ఏళ్ల నాటి స్టోన్ హెంజ్ వద్ద ఓ సాయంత్రం వేళ’ అంటూ నిఖిల్ తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

నిఖిల్ సూపర్ హిట్ సినిమా కార్తికేయలో అతడిది అంతుపట్టని మిస్టరీలను ఛేదించే పాత్ర. ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నిఖిల్ పోస్టింగు చూసిన అభిమానులు ఎలాగూ అక్కడకికెళ్లావు కాబట్టి ప్రపంచానికి అంతు పట్టని రహస్యంగా మిగిలిపోయిన ఆ స్టోన్ హెంజ్ గుట్టు ఏంటో బయటపెట్టమంటూ అడుగుతున్నారు. నిఖిల్... ఓసారి ట్రై చేస్తే పోలా?