Begin typing your search above and press return to search.
విజయవంతమైన 10వ సంవత్సరం
By: Tupaki Desk | 5 Jun 2017 8:19 AM GMTసినిమా ఇండస్ట్రీలోకి గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం అంతే కష్టం. తొలి సినిమాలో మంచి పేరొచ్చినా వన్ ఫిల్మ్ వండర్ గా మిగిలిపోయే వాళ్లు చాలామంది ఉంటారు. వరస ఫ్లాపులతో కెరీర్ పట్టాలు తప్పుతున్న సమయంలో తనను తాను జడ్జ్ చేసుకుని తిరిగి కెరీర్ ను రైట్ ట్రాక్ లో పెట్టుకోవడం చాలా అవసరం. యంగ్ హీరో నిఖిల్ సక్సెస్ ఫుల్ గా పదేళ్లపాటు కెరీర్ పూర్తి చేసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్.
పదేళ్ల క్రితం వచ్చిన హ్యపీడేస్ సినిమా తెలుగు తెరకు కొత్త టాలెంట్ ను పరిచయం చేసింది. అందరూ కొత్త వాళ్లతోనే తీసిన సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. ఇందులోని చాలామంది నటులకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల మంచి ప్లాట్ ఫాం ఇచ్చాడు. ఆ సినిమాలో రాజేష్ క్యారెక్టర్ లో కనిపించిన నిఖిల్ తర్వాత జాలీగా తిరిగే కుర్రాడి గెటప్ లో చాలా సినిమాల్లో కనిపించాడు. ఒకటి, రెండు సినిమాల తర్వాత అతడిని ఫ్లాపులే పలకరించాయి. స్వామి రారా సినిమాలో ఓ కొత్త లుక్ తో తెరపై కనిపించాడు. అప్పటి నుంచి అతడి ఖాతాలో అన్నీ హిట్లే. టెన్ ఇయర్స్ కెరీర్ కంప్లీట్ అయిన సందర్భంగా నిఖిల్ తాజాగా చిన్న పార్టీ అరేంజ్ చేశాడు. ఈ ఫంక్షన్ కు తనతో పనిచేసిన డైరెక్టర్లందరినీ ఆహ్వానించి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.
‘ఎన్నో సినిమాల ఆడిషన్లకు వెళ్లాను. ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియక సతమతం అవుతున్న రోజుల్లో శేఖర్ కమ్ముల అవకాశం ఇచ్చారు.. ఆయనను ఎప్పటికీ మర్చిపోను. అందుకే నా ఫోన్ లో ఆయన పేరు శేఖర్ సార్ గాడ్ అని సేవ్ చేసుకున్నా’ అంటూ నిఖిల్ శేఖర్ కు ధన్యవాదాలు చెప్పారు. ఆడిషన్ సమయంలో ఒక్క సీన్ తోనే అతడిని ఓకే చేశానంటూ శేఖర్ కమ్ముల ఆనాటి రోజులను గుర్తు తెచ్చుకుంటూ చెప్పారు. హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అన్ని సినిమాల టైటిల్స్ ఫంక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో డిస్ ప్లే చేశాడు. రూ. 25 కోట్ల హీరో స్థాయికి ఎదిగిన నిఖిల్ మరిన్ని విజయాలు సాధించాలంటూ అతడి డైెరెక్టర్స్ విష్ చేశారు. వీ ఆల్సో విష్ యూ సేమ్ నిఖిల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/