Begin typing your search above and press return to search.
దాసరికి యంగ్ హీరో అక్షర నివాళి
By: Tupaki Desk | 1 Jun 2017 7:59 AM GMTకేశవ సినిమా హిట్ కావడం యంగ్ హీరో నిఖిల్ కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ సినిమా డీసెంట్ హిట్ కొట్టింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విజయ యాత్రకు కూడా నిఖిల్ వెళ్లొచ్చాడు. ఈరోజు నిఖిల్ బర్త్ డే కావడంతో కేశవ హిట్ మూమెంట్ ను ఎంజాయ్ చేయాలని ఎంతో ప్లాన్ చేసుకున్నాడు. కానీ అనుకోని విధంగా చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కయిన దాసరి నారాయణరావు మృతి చెందడంతో సెలబ్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. దాసరిపై తనకున్న గౌరవ భావాన్ని వెల్లడిస్తూ ఓపెన్ లెటర్ పెట్టాడు.
‘‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది బర్త్ డే బాగా సెలబ్రేట్ చేద్దామనుకున్నా. ఇలాంటి సమయంలో మా సినిమా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఆయనకు నివాళులర్పిస్తూ ఈసారి సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. దాసరి గారు గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన దర్శకుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కూడా. కేవలం ఆయన కారణంగానే వందలాది చిన్న సినిమాలు బతికి బట్టకట్టాయి. యంగ్, అప్ కమింగ్ పిల్మ్ మేకర్స్ కు ఓ తండ్రిలా మార్గనిర్దేశం చేశారు. ఆయన ఎత్తుకు ఎదిగినా కష్టంలో ఉన్నాననే రోజు కూలికి పనికి చేసే వ్యక్తికి సైతం అండగా నిలిచారు. అంతగొప్ప వ్యక్తి లేరని తలచుకుంటేనే కళ్లల్లో నీరు ఆగడం లేదు. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన పాదాలను తాకే అదృష్టం పొందిన ఓ యువనటుడి కన్నీటి నివాళి ఇది’’ అంటూ దాసరిపై తనకున్న అబిమానానికి నిఖిల్ అక్షర రూపమిచ్చాడు.
దాసరి నారాయణరావును కీర్తిస్తూ క్రిష్ సుకుమార్ - రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు ఇదేవిధంగా ఓపెన్ లెటర్ల రూపంలో తమ మనోభావాలను వెల్లడించారు. నిఖిల్ మాత్రం కేవలం మాటలతోనే తన భావాలకు అందమైన అక్షరరూపమిచ్చాడు. సీనియర్ దర్శకుడిపై తనకున్న అభిమానం అతడి లెటర్ చదివిన అందరినీ కదిలించి వేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/