Begin typing your search above and press return to search.
నన్ను ఇంటికొచ్చి కొడతారన్న కోన
By: Tupaki Desk | 3 Dec 2015 10:30 AM GMTస్వామి రారా - కార్తికేయ - సూర్య వెర్సస్ సూర్య.. ఒకదానికి ఒకటి సంబంధం లేని సినిమాలు. నిఖిల్ ఎంత వైవిధ్యంగా సినిమాలు ఎంచుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నవాడు.. ఒకే టెంప్లేట్ లో సినిమాలు చేస్తున్నాడని విమర్శలెదుర్కొంటున్న కోన వెంకట్ తో ‘శంకరాభరణం’ చేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే తాను ‘శంకరాభరణం’ కోన వెంకట్ ను చూసి ఒప్పుకోలేదని.. కథ నచ్చడం వల్లే అంగీకరించానని.. ఈ సినిమా కథ చెప్పేముందు కోన చేసిన వ్యాఖ్యల్లో నిజాయితీ నచ్చి ఆయన సినిమాలో చేయడానికి అంగీకరించానని అంటున్నాడు నిఖిల్.
‘‘శంకరాభరణం కథకు స్ఫూర్తి ఫస్ గయారే ఒబామా. ఐతే కోన గారు కథ చెప్పకముందే నేనా సినిమా చూశా. బాగా నచ్చింది. కోన గారు ఆ కథకు తెలుగు టచ్ ఇచ్చారు. నాకు ఆయన నిజాయితీ బాగా నచ్చింది. పండగ చేస్కో రిలీజ్ తర్వాత ఆయన నాతో ఓ మాట అన్నారు. ‘ఇలాంటి టెంప్లేట్ సినిమా మళ్లీ తీస్తే జనాలు ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ కొడతారు’ అని చెప్పారు. ఇలా ఎంతమంది వాస్తవాలు ఒప్పుకుంటారు చెప్పండి. శంకరాభరణం స్క్రిప్టు విషయంలో అలాంటి రొటీన్ టెంప్లేట్ ఏమీ లేకుండా చూసుకున్నారు’’ అని నిఖిల్ చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది కానీ.. నిఖిల్ దగ్గర వాస్తవం ఒప్పుకున్న కోన.. అప్పట్లో ‘పండగ చేస్కో’ రొటీన్ గా ఉందన్న వాళ్ల మీద మాత్రం సెటైర్లు వేశారెందుకో మరి.