Begin typing your search above and press return to search.
25వ రోజు.. 100 స్క్రీన్లలో ఆడుతోంది
By: Tupaki Desk | 12 Dec 2016 4:58 AM GMTపెద్ద సినిమాలే రెండు మూడు వారాలు నిలబడటం కష్టమవుతోంది. అలాంటిది ఓ చిన్న సినిమా.. అందులోనూ పెద్ద నోట్ల రద్దుతో కలెక్షన్లపై బాగా ప్రభావం కనిపిస్తున్న రోజుల్లో మంచి వసూళ్లతో 25వ రోజుకు చేరడం.. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వంద దాకా స్క్రీన్లలో ఆడుతుండటం విశేషమే. వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఈ ఘనత సాధించింది.
గత నెల 18న రిలీజైన ‘ఈపీసీ’.. మూడు వారాల పాటు పోటీయే లేకుండా బాక్సాఫీస్ ను రూల్ చేసింది. గత వారాంతంలో ‘ధృవ లాంటి భారీ సినిమా రిలీజైనా సరే.. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తన పట్టును కొనసాగిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వీకెండ్లో కూడా కొన్ని చోట్ల ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు హౌస్ ఫుల్స్ పడ్డాయి. శనివారం మల్టీప్లెక్సులు ఫుల్ అయిన దృశ్యాల్ని షేర్ చేశాడు నిఖిల్.
ఓవైపు ధృవ పాజిటివ్ టాక్ తో.. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నా.. ‘ఈపీసీ’ తన ప్రత్యేకతను చాటుకుంటుండటం విశేషమే. నాలుగో వారంలోనూ హైదరాబాద్ లో మాత్రమే 25 స్క్రీన్లలో ఈ చిత్రం ఆడుతోంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఇప్పటికే బయ్యర్లకు లాభాలందించింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. నిఖిల్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా ఉంది.