Begin typing your search above and press return to search.
అమ్మో.. నిఖిల్ కు 90 స్క్రీన్లా!
By: Tupaki Desk | 16 Nov 2016 7:30 AM GMTఓవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కొత్త సినిమాల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ ఈ శుక్రవారం నిఖిల్ సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. 500.. 1000 నోట్ల రద్దు వల్ల కలెక్షన్లు దెబ్బ తినడంతో పాటు ఇంకొన్ని సమస్యలు కూడా ఉన్నప్పటికీ.. ఈ నిర్ణయం వల్ల ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు కొంత మంచి కూడా జరిగింది. మామూలుగా అయితే ఈ సినిమాకు పోటీగా రెండు మూడు సినిమాలొచ్చేవి. కానీ ఇప్పుడు పోటీయే లేకుండా సోలోగా రిలీజ్ చేసుకునే వీలు చిక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్ ఇస్తున్నారు.
ఐతే ఏపీ.. తెలంగాణల్లో ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అమెరికాలో ఈ చిత్రానికి ఏకంగా 90 స్క్రీన్లు ఇవ్వడమే ఆశ్చర్యం. మామూలుగా అక్కడ చిన్న సినిమాలు రిలీజవ్వడమే గొప్ప. చిన్న సినిమాలకు పెద్ద రిలీజ్ అన్నది అరుదుగా జరిగే విషయం. నిఖిల్ రేంజ్ ప్రకారం చూస్తే 90 స్క్రీన్లన్నది అసాధారణమైన విషయం. కొందరు స్టార్ హీరోల సినిమాలకు కూడా అన్ని స్క్రీన్లు దక్కవు. వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. నిఖిల్ తన ఇమేజ్ బాగానే పెంచుకున్నాడు. ‘కార్తికేయ’ సినిమా ఇక్కడి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టకుంది. నిఖిల్ సినిమాలు అక్కడి ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లుగా ఉంటున్నాయి. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దుతో సినిమాలు తగ్గిపోయాయి. లోకల్ జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు కానీ.. యుఎస్ ఆడియన్స్ కు అలాంటి ఇబ్బందేమీ లేదు కాబట్టి వాళ్లు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ‘ఎక్కడికి..’ పాజిటివ్ బజ్ తెచ్చుకుని విడుదలకు సిద్ధమైంది. అందుకే ఈ సినిమాకు ఏకంగా 90 స్క్రీన్లు ఇచ్చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/