Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో నిఖిల్ ఏమోషనల్ పోస్ట్
By: Tupaki Desk | 29 April 2022 7:31 AM GMTయంగ్ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్ధ్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో నిఖిల్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నిఖిల్ ఇంట విషాధ ఛాయలు అలుముకున్నాయి.
తాజాగా నాన్నకు ప్రేమతో నిఖిల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''మంచి వ్యక్తి తన సారథ్యంలో ఎందరో విద్యార్ధుల్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టేందుకు ఎంతో కృషి చేసారు. నాన్నకి ఎన్టీఆర్..ఏఎన్నార్ అంటే ఎంతో అభిమానం. ఆయన చిన్న వయసు నుంచి ఆ ఇద్దరి స్టార్లని ఆరాదించేవారు. నన్ను కూడా వెండి తెరపై చూడాలని బలంగా కోరుకున్న వ్యక్తి ఆయన.
నేను నటుడ్ని అవ్వడంతో ఆయన కోరిక నేర వేరింది. జీవితంలో మంచి అనుభవాల్ని ఆస్వాదించాల్సిన సమయంలో అరుదైన వ్యాధి బారిన పడ్డారు. అయినా నా కోసం..మా కుటుంబం కోసం చివరి శ్వాస వరకూ ఎంతో కష్టపడ్డారు. ఆయనకి మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నా శాంతి చేకూరుతుంది.
నాన్న మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. మిమ్మల్ని తలుచుకోని రోజంటూ ఒకటి లేదు. ప్రతీ రోజు మీరు మా హృదయాల్లోనే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు.
మీ జ్ఞాపకాలు మాకెంతో పదిలం. చివరిగా మీకు ఒకటి బలంగా చెప్పాలనుకుంటున్నా. నేను మీకొడుకుగా పుట్టినందకు ఎంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ అలాగే ఫీలవుతాను'' అని భావోద్వేగతంతో కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇక నిఖిల్ నటుడిగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా మూడు సినిమాలు తెరకెక్కుతన్నాయి. 'కార్తికేయ-2'..'18 పేజీస్'..'స్పై' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంకా యంగ్ హీరో క్రేజ్ నేపథ్యంలో కొత్త అవకాశాలు బాగానే వస్తున్నాయి. డిఫరెంట్ జానర్ సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తో దూసుకుపోతున్నాడు.