Begin typing your search above and press return to search.
కేశవ కథేంటో చెప్పేసిన నిఖిల్!!
By: Tupaki Desk | 3 Jan 2017 5:38 AM GMTకుర్రహీరో నిఖిల్ నటించిన కొత్త మూవీ కేశవ ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ ప్రేక్షకులను మాయ చేసి హిట్ కొట్టిన హీరో.. అదే స్పీడ్ లో కేశవను కూడా పరిచయం చేసేసి.. టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాడు. ఈ మూవీ లుక్స్ చూస్తుంటే యాక్షన్ ఎంటర్టెయినర్ అనే విషయం అర్ధమవుతోంది కానీ.. ''పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరు'' అంటూ బోల్డ్ లెటర్స్ లో వేసిన ట్యాగ్ లైన్ ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
ఇంత పొడుగు ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టాల్సొచ్చింది.. అసలు దాని మీనింగ్ ఏంటి అనే విషయాలను డీటైల్డ్ గా చెప్పేశాడు నిఖిల్. 'నేను ఈ సినిమాలో రాజమండ్రికి చెందిన ఓ స్టూడెంట్ గా కనిపిస్తాను. అత్యంత అరుదైన గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతూ ఉంటాను. అందరి మాదిరిలా కాకుండా.. నా పాత్రకు గుండె కుడివైపున ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు.. టెన్షన్ ఫీల్ అవకూడదు. మెంటల్ టెన్షన్ వచ్చినా.. అది ఫిజికల్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది' అని చెప్పాడు నిఖిల్.
'అలాంటి హెల్త్ కండిషన్ ఉన్న ఒక హీరో.. ఓ మిషన్ లో ఉంటాడు. కొంతమందిని చంపేసి పగ తీర్చుకోవాల్సిన పరిస్థితి. కోపం తెచ్చుకోకుండానే ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేయగలిగాం అన్నదే కేశవ' సినిమా అని చెప్పిన నిఖిల్.. ఈ చిత్రం కోసం ఫైట్స్ అన్నీ తానే చేశానని.. బాడీ డబుల్ ఉపయోగించలేదని అన్నాడు. గెడ్డంతో కనిపించే తన లుక్ ఈ మూవీ స్పెషల్ గా ఉంటుందని చెప్పాడీ కుర్ర హీరో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/