Begin typing your search above and press return to search.
36 సార్లు పోలీస్ తో దెబ్బలు తిన్న హీరో
By: Tupaki Desk | 23 April 2019 5:34 AM GMTచూడడానికి చాలా సింపుల్ షాట్ గా అనిపించే సినిమాల్లోని కొన్ని సన్నివేశాల వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. అప్పుడెప్పుడో మోహన్ బాబు మొదటి సినిమా స్వర్గం నరకం షూట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో మేడపై నుంచి మెట్లు దిగుతూ కిందకు వచ్చే సీన్ దర్శకులు దాసరి నారాయణరావు గారు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా తీస్తూనే ఉన్నారట. అన్ని రీటేకులకు కారణం పర్ఫెక్షన్. ఇది అప్పుడే కాదు ఇప్పుడూ కొందరు ఫాలో అవుతున్నారు.
మే 1 విడుదల కానున్న నిఖిల్ అర్జున్ సురవరం కోసం యూనిట్ మొత్తం ప్రమోషన్ లో చాలా బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. కథ ప్రకారం నిఖిల్ ఓ సీన్ లో పోలీస్ చేతిలో చెంపదెబ్బ తిని కింద పడిపోయే సన్నివేశం ఒకటి ఉంది. అది ఎంతకీ దర్శకుడు సంతోష్ అంచనాలకు అనుగుణంగా రావడం లేదు. ఏదో ఒక కారణంతో చిన్న డిఫరెన్స్ తో అవుట్ పుట్ తేడాగా వస్తోంది. నిఖిల్ ఎంత కో ఆపరేట్ చేస్తున్నా ఏదో మిస్ అవుతోంది.
రాజీ పడటం హీరో దర్శకుడికి ఇష్టం లేదు. దీంతో నో కాంప్రోమైజ్ అనుకుంటూ వన్ మోర్ టేక్ అంటూ తీసుకుంటూ పోయారు. అలా 36 సార్లు తీస్తే ఫైనల్ గా కోరుకున్న ఎఫెక్ట్ వచ్చింది. ఆ ముప్పై ఆరు సార్లు ఆ పోలీస్ పాత్రధారి కొట్టడం నిఖిల్ కింద పడటం జరుగుతూనే ఉందట. అవును మరి ఇంత జాగ్రత్త తీసుకుంటారు కాబట్టే రేపు ధియేటర్లో ఇవే సీన్లకు అప్లాజ్ వచ్చేది. మరో సీన్లో లావణ్య త్రిపాటి కొట్టే సీన్ కూడా ఉందట. అది మాత్రం సింగల్ టేక్ లో పూర్తి కావడం పట్ల నిఖిల్ నవ్వుతూ హమ్మయ్య అనుకోవడం ఆకట్టుకుంది. ఏడాది గ్యాప్ తర్వాత నిఖిల్ చేస్తున్న అర్జున్ సురవరం మీద మంచి అంచనాలే నెలకొన్నాయి