Begin typing your search above and press return to search.

పెళ్లి వాయిదా.. ఫ్రస్ట్రేషన్ కు గురైన యువ హీరో!

By:  Tupaki Desk   |   3 May 2020 7:10 AM GMT
పెళ్లి వాయిదా.. ఫ్రస్ట్రేషన్ కు గురైన యువ హీరో!
X
ఈ లాక్ డౌన్ సాధారణ ప్రజలనే కాదు సెలబ్రిటీలను కూడా ఇబ్బంది పెడుతోంది. షూటింగులు రద్దయ్యాయి.. సమ్మర్ వెకేషన్లు క్యాన్సిల్ అయ్యాయి. ఆఖరికి గోవా ట్రిప్పులు కూడా బంద్. ఇవన్నీ సరే అనుకుని సర్దుకోవచ్చు. కానీ మ్యారేజిలు కూడా వాయిదా పడుతున్నాయి. యువ హీరో నిఖిల్ కు ఈ పరిస్థితి ఎదురైంది. ఒకసారి కాదు.. రెండు సార్లు.

నిఖిల్ కు డా. పల్లవి వర్మతో రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 న వివాహానికి ముహుర్తం కూడా నిశ్చయించారు. అయితే లాక్ డౌన్ కారణంగా నిఖిల్ తన వివాహాన్ని మే 14 వ తేదీకి వాయిదా వేసుకున్నాడు. అప్పటిలోపు ఈ లాక్ డౌన్ ఎత్తేస్తారు అనుకుంటే దాన్ని మరోసారి మే 17 వ తారీఖు వరకూ పొడిగించారు. దీంతో చేసేదేమీ లేక నిఖిల్ తన పెళ్లిని మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం పై స్పందించిన నిఖిల్.. 'చాలా ఫ్రస్ట్రేటింగ్' గా ఉందని వ్యాఖ్యానించాడు. అయితే బయట చాలామంది ఇంతకంటే పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నాడు.

నిజానికి ఈ లాక్ డౌన్ ఎప్పుడు సడలిస్తారు అనే విషయం చాలామందికి అంతుపట్టకుండా ఉంది. కొందరేమో ఇంకా పొడిగిస్తారని అంటూ ఉంటే కొందరేమో ఈ సారి పొడిగించరని బయట తిరగడంపై కొన్ని నిబంధనలను విధించి లాక్ డౌన్ తీసేస్తారని అంటున్నారు. ఏదేమైనా లాక్ డౌన్ ముగిసేవరకూ నిఖిల్ మాత్రం ఆగక తప్పేలా లేదు.