Begin typing your search above and press return to search.
ఒక్క సినిమా కోసం అంత పెంచేశాడు
By: Tupaki Desk | 27 July 2017 7:12 AM GMTస్టార్ హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ ఒక్కదాని పై దృష్టి పెట్టారు. ఇప్పుడు అందరకు కావలిసింది ఒక్కటే కథ. కథ బాగున్న కనీసం చేసే పాత్ర కొత్తగా ఉన్న వెంటనే చేయడానికి ఓకే చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న చిన్న హీరో సినిమాలు కూడా కొన్ని పెద్ద హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అలా చిన్న హీరోగా వచ్చి హిట్లు కొడుతున్న హీరో నిఖిల్.. ఇప్పుడు రాబోతున్న సినిమా కోసం 12 కేజీలు బరువు పెరిగాడు తెలుసా.
యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు కొత్త కథలు కోసం కొత్త పాత్రలు కోసం చూస్తునట్లు తెలుస్తుంది. కిందటి సినిమా కేశవ సినిమా.. పర్వాలేదు అనే టాక్ వచ్చిన బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం బాగనే తెచ్చిపెట్టింది. దీనితో నిఖిల్ తన తదుపరి సినిమా అయిన ఒక రీమేక్ సినిమా కోసం ఇప్పుడు ఉన్న బాడీ సరిపోక ఏకంగా 12 కేజిలు బరువు పెరిగాడు. కిరిక్ పార్టీ అనే ఒక సూపర్ హిట్ కన్నడ ఫిల్మ్ ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అందులో నిఖిల్ ఒక స్టూడెంట్ లీడర్ లా కనిపించనున్నాడు దానికోసం బరువు పెరిగినట్లు తెలిపాడు. నేను ఇప్పుడు 85 కేజిలు ఉన్నాను దీని కోసం ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటున్నాను అని తెలిపాడు. రోజూ మనోడు పొద్దున్న ఎగ్స్.. మధ్యాహ్నం చికెన్.. సాయంత్రం వైట్ మీట్ (చేపలు తరహా మాంసం) తింటున్నాడట. పొద్దస్తమానం ప్రొటీన్ షేక్స్ కూడా తీసుకుంటున్నాడట.
శరణ్ కొప్పిశెట్టి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా అంతా కాలేజీ స్టూడెంట్ వాళ్ళ కాలేజీ సంఘటనలు చుట్టూ కథ ఉంటుంది అని చెబుతున్నారు. రెండు నెలలులో పెరిగిన బరువు చాలక సినిమా షూటింగ్ మొదలుకావడానికి ఇంకా ఒక నెల సమయం ఉండడంతో తన డైట్ పై దృష్టి పెట్టాడు అంటా నిఖిల్. మరి పెరిగిన బాడీ తగ్గిస్తాడా.. లేక ఇలాగే తదుపరి సినిమాలకు కూడా కంటిన్యూ అవతాడా అనేది చూడాలి.