Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: గూఢ‌చారి పాత్ర‌లో నిఖిల్

By:  Tupaki Desk   |   15 Aug 2021 7:30 AM GMT
ట్రెండీ టాక్: గూఢ‌చారి పాత్ర‌లో నిఖిల్
X
ర‌హ‌స్య గూఢ‌చ‌ర్యం విజువ‌ల్ గా ర‌క్తి క‌ట్టిస్తుంది. పెద్ద తెర‌పై సంచ‌ల‌నాల‌కు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నిఖిల్ అదే త‌ర‌హా ప్ర‌యోగం చేస్తున్నారు. 75 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలతో యువ హీరో నిఖిల్ సిద్ధార్థ 19వ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. నిఖిల్ తొలిసారిగా స్పై- యాక్ష‌న్ క‌థాంశంతో ఈ సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీతో గూఢ‌చారి- ఎవరు- HIT వంటి చిత్రాలకు ప‌నిచేసిన ఎడిటర్ గ్యారీ BH దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రెడ్ సినిమాస్ ప్రొడక్షన్ నం 2 పేరుతో కె. రాజ శేఖర్ రెడ్డి- CEO చరణ్ తేజ్ నిర్మించనున్నారు. సరిహద్దులో భారతీయ జెండా .. సైనికులతో పాటు విదేశీ లొకేష‌న్లు ప్రకటన పోస్టర్ లో ఆవిష్క‌రించారు. ఈ కథకు భారీ పరిధి ఉంది. ఇది స్వాతంత్య్ర దినోత్సవ సంద‌ర్భాన్ని ఎలివేట్ చేస్తున్న ఆస‌క్తిక‌ర‌ పోస్టర్ అన‌డంలో సందేహం లేదు.

ఈ సినిమాకి టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. విభిన్న తరహా సినిమాలు చేస్తున్న నిఖిల్ మొదటిసారిగా గూఢచారిగా నటించే అవ‌కాశంపై ఆనందం వ్య‌క్తం చేశారు. ప్రాజెక్ట్ ఇతర వివరాలు వెల్ల‌డించాల్సి ఉంది. ఈ హై బడ్జెట్ ఎంటర్ టైనర్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. ``హంట్ బిగిన్స్ సూన్`` అంటూ పోస్టర్ పైనా వేశారు. రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభమవుతుంది.