Begin typing your search above and press return to search.
సాటివారికి సాయం చేస్తూ ప్రజల హృదయాల్ని గెలుచుకున్న నిఖిల్
By: Tupaki Desk | 31 March 2020 2:00 PM GMTప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలు పెరుగని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే దేశమంతటా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. సినీ ప్రముఖులందరూ తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తున్నారు. సినీ కళాకారులను ఆదుకోవడానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పుడు యువ కథానాయకుడు నిఖిల్ మళ్ళీ సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. మరి కొన్ని శానిటైజర్స్ హెల్త్ ఆఫీసర్స్ కి ఇవ్వబోతున్నట్లు నిఖిల్ తెలిపారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్న వారిలో డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో ఉన్నారు. వారికి శానిటైజర్స్ ఇచ్చి నిఖిల్ తన మంచి మనసును చూపించుకున్నాడు.
ఇంతకుముందు వారి కోసం నిఖిల్ 2000 రెసిపిరేటర్స్, 2000 రి యూజబుల్ గ్లౌవ్స్, 2000 గ్లాసెస్(ఐ ప్రొటెక్షన్), మరియు 2000 శానిటైజర్స్, 10000 మాస్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్, ఐసోలేషన్స్ వార్డ్స్‌లోని డాక్టర్స్ ఇతర సిబ్బందికి అంద చేస్తున్నట్లు తెలియజేశాడు. ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో గాంధీ ఆసుపత్రికి వెళ్లిన నిఖిల్ స్వయంగా వ్యక్తిగత సంరక్షక పరికరాల్ని వైద్యులకు అందించారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఇదే సందర్భంగా నిఖిల్ కోరారు.
ఇదిలా ఉండగా నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ 2’లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నిశ్చితార్థం జరిగింది. భీమవరంకు చెందిన వైద్యురాలు పల్లవిని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఏప్రిల్ 16న వివాహం జరగబోతోంది. మరోపక్క కరోనా వ్యాప్తి వల్ల పెళ్లి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయని వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. అనుకున్నట్లు పెళ్లి చేసుకోవడం కుదరకపోతే గుడిలో అతి తక్కువ మంది సమక్షంలోనైనా జరుగుతుందని అన్నారు.