Begin typing your search above and press return to search.
కార్తికేయ కోసం చాలా దూరం వెళ్తున్న నిఖిల్
By: Tupaki Desk | 1 Aug 2022 1:51 PM GMTయంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి కాంబోలో వచ్చిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుండి కూడా సినిమాకు సీక్వెల్ చేయాలని.. కావాలని చాలా మంది నుంచి విజ్ఞప్తి డిమాండ్ వచ్చింది. ఎట్టకేలకు దర్శకుడు చందు మొండేటి మొదటి పార్ట్ కు ఏమాత్రం తగ్గకుండా.. అంతకు మించి ఉండేలా కార్తికేయ 2 ను తెరకెక్కించాడు.
ఆగస్టు 12వ తారీకున విడుదల కాబోతున్న కార్తికేయ 2 ను చాలా విభిన్నంగా నిఖిల్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవలే ఇస్కాన్ టెంపుల్ లో సందడి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ తమ సినిమా యొక్క ట్రైలర్ ను ప్రదర్శించడం ద్వారా మంచి పబ్లిసిటీని దక్కించుకున్నారు.
ఆ తర్వాత కూడా పదే పదే మీడియా లో ఉంటూ సినిమా ను గురించి జనాల్లో చర్చ జరిగేలా యూనిట్ సభ్యులు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు లేదా మరేదైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వార్తల్లో ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు అన్నట్లుగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనుపమ్ ఖేర్ ను యూనిట్ సభ్యులు కలిసి సినిమా యొక్క ట్రైలర్ ను చూపించడంతో పాటు కార్తికేయ 2 గురించిన విషయాలను తెలియజేశారట.
కృష్ణ ఈజ్ ట్రూత్ అనే హ్యాష్ ట్యాగ్ ను కార్తికేయ 2 టీమ్ అనుపమ్ ఖేర్ తో ఆవిష్కరింపజేశారు. సినిమా కు శ్రీకృష్ణుడికి సంబంధం ఉన్నట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది.
మొత్తానికి సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ వరకు వెళ్లిన నిఖిల్ టీమ్ ను అభినందించాల్సిందే. సినిమాను మూస పద్దతిలో కాకుండా విభిన్నంగా ప్రమోట్ చేస్తున్న కార్తికేయ 2 కు ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలియాలంటే ఆగస్టు 12 వరకు వెయిట్ చేయాల్సిందే.