Begin typing your search above and press return to search.
నిఖిల్ ఒకే ఒక్కసారి నవ్వుతాడు
By: Tupaki Desk | 17 May 2017 10:27 AM GMTయువ కథానాయకుడు నిఖిల్.. ప్రతి సినిమాలోనూ చాలా చలాకీగా కనిపిస్తుంటాడు. అతను ఇప్పటిదాకా చేసినవి చాలావరకు ఎంటర్టైనర్లే. కార్తికేయ.. సూర్య వెర్సస్ సూర్య లాంటి సినిమాల్లో కొంచెం సీరియస్ గా కనిపించినా.. అవి ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్స్ అయితే కావు. అక్కడక్కడా కామెడీ కూడా చేశాడు. ఐతే నిఖిల్ కొత్త సినిమా ‘కేవశ’లో మాత్రం నిఖిల్.. ఇప్పటిదాకా ఎన్నడూ చేయని క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పగ కోసం తపించిపోయే క్యారెక్టర్లో పూర్తి సీరియస్ గా కనిపించనున్నాడు నిఖిల్. టీజర్.. ట్రైలర్.. మిగతా ప్రోమోలు చూస్తేనే సినిమా ఎంత సీరియస్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. నిఖిల్ లుక్స్ చాలా సీరియస్ గా.. ఇంటెన్స్ గా కనిపిస్తున్నాయి.
కుడివైపు గుండె ఉండటం వల్ల ఎక్కువగా భావోద్వేగానికి గురైతే ప్రాణాపాయంలో పడే పాత్ర చేస్తున్నాడు ‘కేవశ’లో నిఖిల్. పైగా అతడి వెనుక ఒక విషాదం ఉంటుంది. దాని తాలూకు పగ తీర్చుకునే పనిలో ఉంటాడు నిఖిల్. ఈ పాత్ర సినిమా మొత్తం బ్లాంక్ ఫేస్ తో ఉంటుందట. నిఖిల్ ముఖంలో నవ్వన్నదే కనిపించదట. ఐతే తన మిషన్ పూర్తయ్యాక మాత్రం నిఖిల్ నవ్వుతాడట. అది సినిమాకు అత్యంత కీలకమైన సీన్ అంటున్నారు. సినిమా మొత్తంలో హీరో నవ్వు ముఖంతో కనిపించేది ఆ ఒక్క సన్నివేశంలోనేనట. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను ఎంత కసితో తీశాడో.. నిఖిల్ అంత బాగా నటించాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారమే ‘కేశవ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిఖిల్ సరసన రీతూ వర్మ నటించిన ఈ సినిమాను అభిషేక్ నిర్మించాడు.