Begin typing your search above and press return to search.

ప్రతిభను ప్రోత్సహిస్తున్న నిఖిల్

By:  Tupaki Desk   |   3 Aug 2015 5:38 AM GMT
ప్రతిభను ప్రోత్సహిస్తున్న నిఖిల్
X
పుస్తకాలు ఎక్కువగా చదివేస్తే పిచ్చోడని అన్నట్టే సినిమాల గురించి ఆ రేంజ్ లో బుర్ర బద్దలుకోట్టుకునే వారిని సినిమా పిచ్చోళ్లని అంటూంటారు. ఇలాంటోళ్ళు మనకి చాలామంది కనపడుతూనే వుంటారు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా వారి కళ్ళలో కొలువై వుండే క(ళ)ల సినిమానే. ఆశ వున్నా అవకాశం వుండదు.. ప్రతిభ వున్నా పైపైకి ఎదగడం ప్రయాసే. ఇలాంటి వారికి అవాకాశం ఇస్తామని అంటున్నాడు యువ హీరో నిఖిల్.

సినీ పరిశ్రమలో అవకాశాలు, విజయాల గురించి నిఖిల్ కి బాగా తెలుసు. మనోడికి కుటుంబపరమైన వ్యాపారలున్నా సినిమా పిచ్చే ఇక్కడికి లాక్కొచ్చింది. హ్యాపీడేస్ పరిచాయమయ్యడే కానీ అవి జీవితంలో నిలవడానికి హీరోగా నిలదొక్కుకోడానికి విపరీతంగా శ్రమించాడు. మూస ధోరణికి మూకుడు కట్టి కొత్త పంథా ఎంచుకుని వరుస విజయాలు సంపాదించిన నిఖిల్ సినీ పరిశ్రమలో ప్రతిభ గల వారికి అవాకాశాలు తక్కువగా వస్తున్న విషయాన్ని ఒప్పుకుని అటువంటి వారికి తనవంతుగా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చాడు. ప్రతిభ కలవారు తమ కథలని, ఆలోచనల్ని Scripts.nikhil@gmail.com కి మెయిల్ చేస్తే పరిశీలించి అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. సినిమా పిచ్చోళ్ళకు నిజంగా ఇదో సువర్ణావకాశం.. తుపాకి.కామ్ ద్వారా నిఖిల్ ని అభినందిస్తూ ప్రతిభావంతులకు విజయోస్తు..!