Begin typing your search above and press return to search.
సుకుమార్ రాసిన పాత్రలో నేను.. 18 పేజెస్ ఈవెంట్ లో నిఖిల్ ఎమోషనల్..!
By: Tupaki Desk | 20 Dec 2022 7:50 AM GMTసుకుమార్ కథతో సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా 18 పేజెస్. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. కార్తికేయ 2 తో నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న నిఖిల్ ఈసారి 18 పేజెస్ అనే మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా నిఖిల్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తన సినిమా ఈవెంట్ కి అల్లు అర్జున్ రావడం అద్భుతంగా ఉందని అన్నారు.
కార్తికేయ 2 సినిమా అంత గొప్ప సక్సెస్ అవడానికి రెండు టీం లు కారణమని. అందులో ఒకరు రాజమౌళి తీసిన బాహుబలి ఫ్రాంచైజ్ లు కాగా.. మరొకటి సుకుమార్, అల్లు అర్జున్ తీసిన పుష్ప. ఆ రెండిటి వల్లే పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమాల మార్కెట్ పెరిగింది. ఆ దారిలోనే కార్తికేయ 2 కూడా సక్సెస్ అయ్యిందని అన్నారు. ఇక 18 పేజెస్ సినిమాకు మీడియా ప్రోత్సాహం బాగుందని.. ఈ ఏడాది కార్తికేయ 2 సక్సెస్ అవడం గొప్ప విషయం కాగా.. 18 పేజెస్ కూడా మరో హిట్ అందిస్తుందని అన్నారు.
2022 తనకు బాగా కలిసి వచ్చినట్టు చెప్పిన నిఖిల్ ఇదే ఏడాది తన తండ్రిని కోల్పోయానని అన్నారు. ఆ టైం లో అల్లు అరవింద్ గారు తనకు సపోర్ట్ గా ఉన్నారు. తనలాంటి ఎంతోమందికి పరిశ్రమలో ఫాదర్ ఫిగర్ లా అల్లు అరవింద్ గారు ఉంటున్నందుకు థాంక్స్ అని అన్నారు.
18 పేజెస్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ గురించి మాట్లాడుతూ ఒక సినిమా కోసం 3 ఏళ్లు పనిచేయడం చాలా కష్టమని.. ఈ 3 ఏళ్లు ఓ బేబీలా ఈ సినిమాని చూసుకున్నారని. అతని డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అన్నారు నిఖిల్. సుకుమార్ చేసిన ఆర్య సినిమా తను చాలా సార్లు చూశానని.. తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్లానని. అలాంటి సుకుమార్ గారు రాసిన కథ తన దగ్గరకు వస్తే అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన రాసిన పాత్రలో తాను నటించడం లక్కీ అంటున్నారు నిఖిల్.
సినిమా మీద చాలా నమ్మకం ఉందని. డిసెంబర్ 23న ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుందని అన్నారు నిఖిల్. కార్తికేయ 2 తో పనిచేసిన అనుపమ ఈ సినిమాతో పనిచేయడం బాగుందని. ఈ సినిమాతో ఆమె ప్రేమలో మళ్లీ ఆడియన్స్ పడతారని అన్నారు. ఇక సినిమా ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు నిఖిల్. ఇందాక ఎస్.కె.ఎన్ చెప్పినట్టు అల్లు అర్జున్ ఆర్మీ పాన్ ఇండియా కాదు పుష్ప 2 తో పాన్ వరల్డ్ ఏర్పడుతారని అన్నారు. బన్నీ వాసు గురించి కూడా చెబుతూ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత అయ్యారు ఆయన డైరెక్టర్ గా కూడా అయితే బాగుంటుందని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.