Begin typing your search above and press return to search.
మాఫియాల్ని తలదన్నే మద్ధతు ఆ హీరోకి ఉంది!
By: Tupaki Desk | 14 Aug 2022 12:30 PM GMTథియేటర్ మాఫియాపై నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు బలవంతులో వారు శాసిస్తారు. థియేటర్లను గుప్పిట పట్టి ఆటాడిస్తారు. అయితే దానికోసం చాలా పెట్టుబడుల్ని కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అంతకుమించి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రిలీజ్ చేయాల్సి ఉంటుంది.
కానీ ఇటీవలి కాలంలో కంటెంట్ లేని సినిమాలు ప్రైమ్ థియేటర్లలో ఆడుతుంటే హిట్టు టాక్ తెచ్చుకున్న కార్తికేయ 2 మాత్రం హైదరాబాద్ నగరంలో పరిమితంగా కనిపిస్తోంది. దీనికి కారణమేమిటీ? అన్నది ఆరా తీస్తే...దీనివెనక థియేటర్ మాఫియా ఉందంటూ నిఖిల్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య థాంక్యూ వల్ల కార్తికేయ 2 వాయిదా పడింది. ఆ సినిమాని సోలో రిలీజ్ చేయాలని దిల్ రాజు కార్తికేయ 2 వాయిదాకు కారణమయ్యారని నిఖిల్ ఫ్యాన్స్ నిందిస్తున్నారు.
ఎట్టకేలకు కార్తికేయ 2 విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. తొలి వీకెండ్ చక్కని వసూళ్లను అందుకుంటోందని ట్రేడ్ చెబుతోంది. అయితే 'కార్తికేయ 2'కి సోలో రిలీజ్ సాధ్యపడకపోవడం నష్టాన్ని కలిగించింది. ఇప్పటికే మూడు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో ఉండగా ఈ మూవీని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' భారీగా థియేటర్లలో విడుదలైంది. లాల్ సింగ్ చద్దా- మాచర్ల నియోజకవర్గం- సీతా రామం చిత్రాలను బలమైన పంపిణీదారులు విడుదల చేయడంతో కార్తికేయ 2 కి థియేటర్ల కొరత తప్పలేదు. హిట్టు టాక్ తెచ్చుకుని కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. లాల్ సింగ్ చడ్డా కోసం ఎక్కువ థియేటర్లను బ్లాక్ చేసి ఆడిస్తున్నారు. ఈ మూవీకి నెగెటివ్ స్పందనలు ఉన్నా సెలవు రోజులు కావడంతో థియేటర్ల నుంచి తొలగించలేదు. దీంతో ఇదంతా థియేటర్ మాఫియా పనే అంటూ నిఖిల్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సెలవు దినాల్లో ఎలాంటి సినిమాకి అయినా ఆదరణ దక్కుతుంది. అందువల్ల ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న అగ్ర హీరోల సినిమాలు ఇంకా ఆడుతున్నాయి. సీతారామం - బింబిసార లాంటి సినిమాలు హిట్టు టాక్ తెచ్చుకున్నవే గనుక వీటిని ఇప్పట్లో తొలగించకపోయినా లాల్ సింగ్ చడ్డా గురించే ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
ఇది రాంగ్ టైమింగా?
నిఖిల్ కార్తికేయ 2 రిలీజ్ డే అద్భుతమైన పాజిటివ్ టాక్ సమీక్షలను పొందింది. టాక్ రాకముందే ఈ చిత్రానికి అద్భుతమైన బుకింగ్ లు వచ్చాయి. మ్యాట్నీ నుంచి మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా తొలిరోజే 25 శాతం రికవరీ చేసింది. అయితే హైదరాబాద్ లో ఈ చిత్రానికి చాలా తక్కువ థియేటర్లు మాత్రమే దక్కాయి . ఈ చిత్రానికి థియేటర్ల కొరత స్పష్టంగా ఉంది. కార్తికేయ 2 కంటే లాల్ సింగ్ చద్దాకు కూడా ఎక్కువ థియేటర్లు ఇవ్వడం కనిపించింది. నగరంలో ఎక్కువ థియేటర్లు ఇవ్వకపోవడంపై నిఖిల్ అభిమానులు ప్రస్తుతం గుర్రుమీదున్నారు.
అయితే ఈ సన్నివేశాన్ని భిన్న కోణాల్లో చూడాలి. లాల్ సింగ్ చద్దా- మాచర్ల నియోజకవర్గం- సీతా రామం - బింబిసార చిత్రాలను అగ్ర పంపిణీదార్లు రిలీజ్ చేసారు. ఫ్లాప్ సినిమాలకు కూడా వారాంతపు సెలవులు స్వాతంత్య్ర దినోత్సవం వంటి వాటి వల్ల డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడతారు. హాలిడే సీజన్ లో ఆడియెన్ థియేటర్లకు అతుక్కుపోవడం చాలా సహజం కాబట్టి తమ సినిమాలకు కలెక్షన్ల రికవరీ గురించి ఆలోచిస్తారు. మరోవైపు ఎగ్జిబిటర్లకు ఏ సినిమాకైనా అద్దెలను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి 'కార్తికేయ 2' కోసం ఎటువంటి సహాయం చేయనవసరం లేదు. 'కార్తికేయ 2'కి ఎక్కువ థియేటర్లు .. ఎక్కువ కలెక్షన్లు రావాలంటే థియేటర్లు ఎక్కువ కావాలి. కానీ అది ఇప్పుడు పాజిబుల్ కాదు.
మంచి టాక్ ఉన్న సినిమా కోసం నిజాయితీగా థియేటర్లు ఇవ్వాలి. కానీ డబ్బు కక్కుర్తితో ప్రజల్ని దోపిడీ చేసే సినిమాల్ని ఆడించడం అన్యాయమని నిఖిల్ అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా కార్తికేయ 2కి అన్యాయం జరిగిందన్నది వాస్తవం. ఇకపోతే ఇలాంటి సమయంలో రిలీజ్ చేయడం రాంగ్ టైమింగా? అంటే.. కానే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నా .. ఉత్తరాదిన కార్తికేయ 2 వసూళ్లు అద్భుతంగా ఉన్నాయంటూ టాక్ వచ్చింది. అలా జరిగింది అంటే అక్కడ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలను కార్తికేయ 2 డామినేట్ చేసిందనే. యువహీరో నిఖిల్ ముందు అమీర్ ఖాన్ - అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు తేలిపోయాయి. ఇది అతడికి మంచి ఆరంగేట్రపు అనుభవాన్ని గుర్తింపుని ఇస్తుంది.