Begin typing your search above and press return to search.

రంగులతో ప్రమోషన్లు చేసేసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   1 March 2018 1:23 PM GMT
రంగులతో ప్రమోషన్లు చేసేసుకుంటున్నాడు
X
ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎంత బావుండలో ప్రోమోషన్స్ కూడా అంతే గట్టిగా చేయాల్సి వస్తోంది. సినిమా హిట్ లో ప్రోమోషన్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి అంటే ఒప్పుకోవాల్సిందే. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మేకర్స్ ప్రోమోషన్ల మీద బాగానే టైం కేటాయిస్తున్నారు.

మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి సినిమా విషయం లో హీరో విజయ్ దేవేరకొండ కాలేజ్ లకి వెళ్లి అక్కడ యువత తో ఆడి, పాడి బోలెడంత హైప్ తీసుకొచ్చాడు సినిమా కి. అర్జున్ రెడ్డి కూడా ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిన విషయమే కదా. అందుకే ఈ ఫార్ములా ని మరో యంగ్ హీరో కూడా ఫాలో అయిపోతున్నాడు. అతనే నిఖిల్. వరుస హిట్లతో జోరు మీద ఉన్న ఈ కార్తికేయ హీరో ఇప్పుడు ఒక రీమేక్ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు. కన్నడ కిరాక్ పార్టీ సినిమా ని అదే పేరుతో రీమేక్ చేస్తున్న నిఖిల్ ఈ సినిమా ప్రోమోషన్ల కోసం హొలీ ఆడేస్తున్నాడు.

తన ఇద్దరు హీరోయిన్లతోనే కాకుండా వేరే అమ్మాయిలతో కూడా కలిసి ఇవాళ హొలీ రోజున రంగులు చల్లేసుకుంటూ హంగామా చేసేస్తుంన్నాడు. అతని హొలీ సెలెబ్రేషన్స్ తాలూకా ఫోటోలు ఇపుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధం కాబోతుండగా, నిఖిల్ మాత్రం రంగులతో ప్రోమోషన్లు చేసేస్తున్నాడు.