Begin typing your search above and press return to search.

ప్రేమికుల రోజునే నిఖిల్ ప్రేమ విఫలం

By:  Tupaki Desk   |   14 Feb 2018 7:46 AM GMT
ప్రేమికుల రోజునే నిఖిల్ ప్రేమ విఫలం
X
ఇవాళ ప్రేమికుల రోజు. వేలంటైన్స్ డే అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రేమ జంటలు అందరూ తెగ సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటారు. తమ ప్రేమను తెగ గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాలలో గడుపుతుంటారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం.. తన ప్రేమ విఫలం అయిందంటూ చెప్పేశాడు. ఈ కుర్రహీరో లవ్ ఫెయిల్యూర్ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా చెప్పాడు. పోస్టర్ అనగానే రియల్ లవ్ కాదు.. ఆన్ స్క్రీన్ లవ్ అనే సంగతి అర్ధమయిపోయింది కదా.

ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్ధ్ నటిస్తున్న మూవీ కిర్రాక్ పార్టీ. కన్నడ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీకి ఇప్పుడో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో నిఖిల్ ఓ గులాబీ పువ్వును పట్టుకుని ఉంటాడు. కానీ ఆ పువ్వు మాత్రం కిందకు వంగిపోయి కనిపిస్తుంది. ఈ కుర్రాడి మొహంలో డీలాతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇదొక్కటి చాలు.. నిఖిల్ ప్రపోజల్ కు ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటో అర్ధం చేసుకునేందుకు. అలా తన ప్రేమ ప్రతిపాదనకు వ్యతిరేకత రావడంతో.. నిఖిల్ ఇలా డీలా పడిపోయాడు.

అలా తన లవ్ ఫెయిల్యూర్ విషయాన్ని చెప్పేశాడు నిఖిల్. ఈ హీరోకి జోడిగా సిమ్రాన్ పరీంజా.. సముఖ్య హెగ్డే నటించిన కిర్రాక్ పార్టీ మూవీ.. సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. శరణ్ కొప్పి దర్శకత్వంలో కిర్రాక్ పార్టీ రూపొందుతుండగా.. ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.