Begin typing your search above and press return to search.

అప్పుడు మాత్రం నాకు కోపం వచ్చేస్తుంది : హీరో నిఖిల్

By:  Tupaki Desk   |   7 Aug 2022 12:30 AM GMT
అప్పుడు మాత్రం నాకు కోపం వచ్చేస్తుంది : హీరో నిఖిల్
X
మొదటి నుంచి కూడా నిఖిల్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. కథలో కొత్తదనం ఉండేలా .. పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ వెళుతున్నాడు. 'అర్జున్ సురవరం' హిట్ అయినప్పటికీ ఆయన నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు.

ఆయన తాజా చిత్రంగా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కార్తికేయ 2' సిద్ధమవుతోంది. గతంలో వచ్చిన 'కార్తికేయ' సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమాను మించి ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి.

తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ .. 'అర్జున్ సురవరం' తరువాత పాండమిక్ రావడం వలన నా నుంచి మరో సినిమా రావడం ఆలస్యమైంది. పాండమిక్ తరువాత ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా '18 పేజెస్' .. ' కార్తికేయ 2' .. స్పై' సినిమాలను పట్టాలెక్కించాను. వాటిలో ముందుగా 'కార్తికేయ 2' ప్రేక్షకులను పలకరించనుంది. ద్వాపరయుగానికీ .. ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా విడుదల అనేది నన్ను చాలా టెన్షన్ పెట్టేసింది.

ఈ సినిమాకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ వచ్చాయి. అయినా ఇది థియేటర్స్ లో చూడవలసిన సినిమా అనే ఉద్దేశంతో నిర్మాతలు వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ .. సౌండ్ ఎఫెక్ట్స్ ను థియేటర్స్ లో చూసినప్పుడే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు. హండ్రెడ్ పర్సెంట్ ఆస్వాదించగలుగుతారు. అందువలన థియేటర్స్ లో విడుదల చేయాలనే పట్టుదలతోనే ఇక్కడివరకూ వచ్చాము. రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటే ఎంగ్జైటీ పెరిగిపోతోంది.

ఇక నేను స్కిప్ట్ విషయంలో ఎక్కువ జోక్యం చేసుకుంటాననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఒక్కోసారి స్క్ర్తిప్ట్ అంతా వినేసి ఓకే చెప్పేసి సెట్స్ పైకి వెళ్లిన తరువాత కథ మారుస్తూ ఉంటారు. అలా కథ మార్చడం నాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు .. అలా జరిగితే వెంటనే కోపం వచ్చేస్తుంది.

ముందుగా చెప్పిన కథను ఎందుకు మార్చారు? అని అడిగితే, స్క్రిప్ట్ విషయంలో జోక్యం అని ప్రచారం చేస్తుంటారు. ఇకపై ఒకసారి కథ ఓకే అయ్యాక అందరం సైన్ చేస్తాం .. ఆ తరువాత మా అందరి అనుమతి లేకుండా కథలో మార్పులు చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చాడు.