Begin typing your search above and press return to search.

నిఖిల్ ప్రేమిస్తోంది ఎవరినో తెలుసా?

By:  Tupaki Desk   |   2 Dec 2015 1:30 PM GMT
నిఖిల్ ప్రేమిస్తోంది ఎవరినో తెలుసా?
X
అవును యువ కథానాయకుడు నిఖిల్ ప్రేమలో పడ్డాడట. అతను ప్రేమిస్తోంది ఎవరినో కాదు.. కోన వెంకట్‌ ని. ఈ మాట స్వయంగా నిఖిలే చెప్పాడు. తనకు ‘శంకరాభరణం’ లాంటి మంచి సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన కోన ప్రేమలో తాను పడిపోయానని చెప్పాడు నిఖిల్. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు.. ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా.. అని అడిగితే నిఖిల్ చెప్పిన సమాధానం ఇది. ఐతే పెళ్లి విషయంలో ఆలస్యమేమీ చేయనని.. 2016లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు నిఖిల్.

కోన వెంకట్ తో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘ఓ రోజు కోన గారు ‘శంకరాభరణం’ లైన్ వినిపించారు. 45 నిమిషాల కథనం మాత్రం చెప్పారు. కానీ నేను పూర్తి కథ చెప్పమన్నాను. ఆయన ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల తర్వాత పూర్తి స్క్రిప్టుతో వచ్చి కథ చెప్పారు. బాగా నచ్చడంతో సినిమా ఒప్పుకున్నా. స్వామి రారా - కార్తికేయ - సూర్య వెర్సస్ సూర్య తర్వాత నేను ఎలాంటి వైవిధ్యమైన కథ కోరుకున్నానో అలాంటి కథే చెప్పారు కోన’’ అన్నాడు నిఖిల్.

శంకరాభరణం తర్వాత ‘టైగర్’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానన్న నిఖిల్.. ఇంతకుముందు అనుకున్నట్లే చందూ మొండేటితో ‘కార్తికేయ-2’ చేయడం ఖాయమని తెలిపాడు. ఈ రెండు సినిమాలూ 2016లోనే పూర్తవుతాయని చెప్పాడు.