Begin typing your search above and press return to search.
ఐదున్నర కోట్లకు నిఖిల్ ముద్ర
By: Tupaki Desk | 8 April 2018 6:11 AM GMT ఈ మధ్యే కిరాక్ పార్టీతో ఓ మోస్తరుగా పరవాలేదు అనిపించుకున్న యూత్ హీరో నిఖిల్ కొత్త సినిమా ముద్ర(వర్కింగ్ టైటిల్)షూటింగ్ గత నెల లాంచనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంకా రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్ళకుండానే ఈ మూవీ సంచలనాలకు వేదికగా మారుతోంది. స్టార్ మా ఛానల్ దీని హక్కులను తెలుగు హింది బాషలకు కలిపి 5.5 కోట్లకు కోనేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళ్ సూపర్ హిట్ కనితన్ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి టాగోర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటున్న నిఖిల్ ఇందులో కూడా తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. థ్రిల్లర్ తరహాలో రూపొందిన కనితన్ అక్కడ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. తెలుగులో నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేసి ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్టు యూనిట్ సమాచారం.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సినిమా బడ్జెట్ లో శాటిలైట్ హక్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిఖిల్ గత సినిమాలు కేశవా, కిరాక్ పార్టీ కూడా విడుదలకు ముందే మంచి రేట్ దక్కించుకుని నిర్మాతను సేఫ్ జోన్ లో ఉంచాయి. ఇప్పుడు ముద్రకు దక్కిన ధరను చూస్తే నిఖిల్ మార్కెట్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి. కొత్త సినిమాల విషయంలో స్టార్ మా ఛానల్ చాల స్ట్రాటజీతో వెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వచ్చాక డిజిటల్ హక్కుల విధానంలో అనూహ్య మార్పులు వచ్చాయి. 28 రోజులకే ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో సినిమా పెట్టే పద్దతిని పరిచయం చేసి అమెజాన్ కొత్త సంచలనం రేపింది. ఈ ప్రభావం సహజంగానే శాటిలైట్ రైట్స్ మీద కూడా పడుతోంది. అందుకే స్టార్ మా రాజీ పడకుండా వర్క్ అవుట్ అవుతాయనుకున్న సినిమాలకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడటం లేదు. ఈ నేపధ్యంలోనే ముద్రకు మంచి ఆఫర్ వచ్చినట్టు కనిపిస్తోంది