Begin typing your search above and press return to search.
నిఖిల్ 'ముద్ర' కు ఆ రెండూ అడ్డు
By: Tupaki Desk | 25 Oct 2018 4:32 AM GMTయంగ్ హీరో నిఖిల్ సినిమా వస్తోంది అంటే ఫ్యాన్స్ - ఇండస్ట్రీ వర్గాల్లో ఒకటే క్యూరియాసిటీ ఉంటుంది. యూనిక్ కాన్సెప్టుల్ని ఎంచుకుని, ఇమేజ్‌తో పనే లేకుండా కొత్తగా, డేరింగ్‌గా కనిపిస్తాడన్న నమ్మకం - భరోసా నిఖిల్ ని చూస్తే మార్కెట్ వర్గాలకు ఉంది. అందుకే గత కొంతకాలంగా అతడు నటిస్తున్న `ముద్ర` ఎప్పుడొస్తుందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా ఎందుకో అంతకంతకు ఆలస్యమవుతోంది. ఇదిగో వస్తుంది.. అదుగో వస్తుంది! అంటూ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నా డిలే ఇబ్బందికరంగా మారిందన్న మాటా వినిపిస్తోంది.
గత కొంతకాలంగా ఈ సినిమా టైటిల్ వివాదం కాస్త ఇబ్బందికరంగానే మారింది. `ముద్ర` టైటిల్ ని వేరొకరు రిజిష్టర్ చేయించుకోవడం - దానిని ఇంకొకరు తీసుకుని సినిమా తీయడం జరిగాయట. అయితే `ముద్ర` టైటిల్ ని తాము ప్రకటించాకే - వేరొకరు ఆ టైటిల్ ని రిజిష్టర్ చేయించారని ఠాగూర్ మధు ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ క్లారిటీ ఇచ్చారు. సినిమా పూర్తయింది కదా? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న ప్రశ్నకు ఆయన కాస్తంత అస్పష్టమైన సమాధానమిచ్చారు.
ఇప్పటికే `ముద్ర` సినిమాని ఈ దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయాలనుకుంటోంది టీమ్. నిర్మాతల వైపు నుంచి ఆలోచన అది. కానీ ఈ నెలంతా అన్నీ భారీ సినిమాలున్నాయి. `ముద్ర` రిలీజ్ గురించి ఆలోచిస్తున్నాం. నవంబర్ 8న బాలీవుడ్ క్రేజీ చిత్రం `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` అత్యంత భారీగా రిలీజవుతోంది. కాస్త అటూ ఇటూ వెళదామంటే నవంబర్ 29న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `2.ఓ` రిలీజవుతోంది. ఈ రెండు పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ చేయాల్సిన సన్నివేశం ఉంటుందేమో.. అంటూ కాస్త సందిగ్ధతను `ముద్ర` సమర్పకుడు ఠాగూర్ మధు వ్యక్తం చేశారు. మంచి రిలీజ్ తేదీ సినిమా విజయానికి కారణమవుతోంది కాబట్టి, దానికోసం వేచి చూస్తున్నామనే ధోరణి అతడిలో కనిపించింది. నిఖిల్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ముద్ర. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. నవతరం దర్శకుడు టి.ఎన్.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.