Begin typing your search above and press return to search.

బెస్ట్ అవుట్ పుట్ తో వస్తానంటున్న నిఖిల్

By:  Tupaki Desk   |   15 Jan 2019 6:39 AM GMT
బెస్ట్ అవుట్ పుట్ తో వస్తానంటున్న నిఖిల్
X
డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ఎప్పుడూ కొత్తదనం కోసం తపించే టాలీవుడ్ హీరోలలో నిఖిల్ ముందువరసలోనే ఉంటాడు. గత కొన్నేళ్ళలో నిఖిల్ నటించిన సినిమాలను గమనిస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ నిఖిల్ ప్రస్తుతం 'ముద్ర' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి నిఖిల్ ఓ అప్డేట్ ఇచ్చాడు.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ 'ముద్ర' నుండి ఒక పోస్టర్ షేర్ చేశాడు. అందులో నిఖిల్ రొమాంటిక్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎత్తుకున్నాడు. ప్రేయసిని ఎత్తుకున్నప్పుడు బరువేమీ ఉండదు కదా.. అందుకేనేమో న్ఖిల్ ఫేస్ లో భారంగా ఉన్న ఫీలింగ్ కంటే హాయిగా ఉన్న ఎక్స్ ప్రెషనే ఉంది. ఇక లావణ్య కూడా నిఖిల్ భుజాలపై చేతులు వేసి ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చింది. ఇద్దరి బ్యాక్ గ్రౌండ్ లో హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసిన ఉన్న ఒక వ్యాన్ ఉంది. ఓవరాల్ గా పోస్టర్ మాత్రం అదిరిపోయింది.

ఈ పోస్టర్ తో పాటుగా "ముద్ర రెడీ అవుతోంది.. ఇక ఐదు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. దాంతోపాటుగా చాలా గ్రాఫిక్స్ వర్క్ కూడా చేయాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా త్వరగానే రావాల్సి ఉందికానీ ఆలస్యం అయినందుకు నా శ్రేయోభిలాషులను క్షమించమని కోరుతున్నాను. త్వరలో బెస్ట్ అవుట్ పుట్ తో మీ ముందుకు వస్తాం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ ఆల్" అంటూ ట్వీట్ చేశాడు.

'ముద్ర' కు సంగీత దర్శకుడు సామ్ సిఎస్. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ళ.. కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.