Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో అది లేనే లేదంటున్న యంగ్ హీరో
By: Tupaki Desk | 22 Jun 2020 6:15 AM GMTఇండస్ట్రీ ఏదైనా కూడా నెపొటిజం అనేది ఖచ్చితంగా ఉంటుందని.. కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో కూడా నెపొటిజం అనేది ఉందని కాకుంటే సినిమా పరిశ్రమలో అది కాస్త ఎక్కువగా ఉంటుందనే వాదన చాలా మందిలో ఉంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆ వాదన మరింత ఎక్కువ అయ్యింది. బాలీవుడ్ కు చెందిన కొందరు చూపించే నెపొటిజం కారణంగానే సుశాంత్ వంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారు డిప్రెషన్ కు లోనై చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ కు ప్రముఖులపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్ లో తనకు ఎప్పుడు కూడా నెపొటిజన్ ఎదురు కాలేదు. నా ఆఫర్లు వేరే వారికి వెళ్లడం.. నన్ను తొక్కేసేందుకు ప్రయత్నాలు ఎప్పుడు కూడా నాకు ఎదురు కాలేదని నిఖిల్ అన్నాడు. ఇండస్ట్రీలో ఎవరికి అయితే ప్రతిభ ఉంటుందో ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది. కుటుంబ నేపథ్యం ఉన్నంత మాత్రాన స్టార్స్ అవచ్చు అనేది పొరపాటు. మొదట ప్రతిభ ఉండాలి ఆ తర్వాతనే కుటుంబ నేపథ్యం.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో నేను ఎక్కడ కూడా నెపొటిజం చూడలేదు. టాలీవుడ్ లో ఆ వివక్ష అనేది లేదనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించడం లేదు. టాలీవుడ్ లో నెపొటిజం లేదు అంటూ ఆయన ఇండస్ట్రీకి చెందిన కొంత మందిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా మంది బ్యాక్ గ్రౌండ్ లేని వారు టాలీవుడ్ లో అలా వచ్చి ఇలా వెళ్లి పోవడంకు కారణం నెపొటిజం అంటూ కొందరు బలంగా వాదిస్తున్నారు.