Begin typing your search above and press return to search.
పాపం సినిమాలాగే ట్రైలర్ కూ కష్టాలే!
By: Tupaki Desk | 20 Nov 2019 8:01 AM GMTనిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా టి సంతోష్ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ సురవరం' చిత్రం దాదాపు ఆరు నెలలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. ఆమద్య విడుదల తేదీ కూడా ప్రకటించిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మొదట టైటిల్ వివాదం ఆ తర్వాత మరేదో కారణం వల్ల సినిమా వాయిదాలు పడింది. సాదారణంగా ఇలా సినిమాలు వాయిదా పడితే ఆసక్తి తగ్గుతుంది. కాని అర్జున్ సురవరంపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది.
ఎట్టకేలకు సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే వారంలో అంటే నవంబర్ 29న సినిమా విడుదల కాబోతుంది. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. ట్రైలర్ విడుదల సందర్బంగా టెక్నికల్ సమస్య కారణంగా ట్రైలర్ కు బదులుగా టీజర్ ను ప్రసారం చేశారు. ఆ సమయంలో నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. టెక్నీషియన్స్ పై ఇరిటేట్ అయ్యి వారిపై అరిచాడు కూడా. సినిమా విడుదలకు సమస్యలు ఎదుర్కొంది. ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలకు సమస్య ఎదుర్కొంటుందంటూ అక్కడున్న వారు జోకులు వేసుకున్నారు.
పైనల్ గా ట్రైలర్ విడుదలైన తర్వాత మీడియా వారితో పాటు అంతా కూడా వావ్ అంటున్నారు. ఇన్నాళ్లు ఆలస్యం అయినా కూడా సినిమాలో మంచి కంటెంట్ ఉందని.. తప్పకుండా ఇది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు ఆలోచింపజేస్తుందనే నమ్మకంను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో 24 గంటలు గడవకుండానే మిలియన్ మార్క్ ను క్రాస్ చేయబోతుంది. నిఖిల్ తన కెరీర్ లో చేసిన అన్ని సినిమాల్లోకి దీని కోసం ఎక్కువ కష్టపడ్డట్లుగా చెబుతున్నాడు. నిఖిల్ కష్టం ట్రైలర్ లో కనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే కామెంట్ ట్రైలర్ కు వస్తున్నాయి.