Begin typing your search above and press return to search.

జర్నలిజం లోతుల్ని 'నిఖిల్' చెప్పబోతున్నాడా?

By:  Tupaki Desk   |   6 May 2019 4:32 AM GMT
జర్నలిజం లోతుల్ని నిఖిల్ చెప్పబోతున్నాడా?
X
జర్నలిజం.. అంతుచిక్కని సబ్జెక్ట్.. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. వాళ్ల పనితనం ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. ప్రింట్ మీడియాలో పగలు పడుకుంటారు.. రాత్రిళ్లు మేలుకొని డెస్క్ లలో పనిచేస్తారు.. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో 3 షిఫ్ట్ లు.. 8 గంటలకో షిఫ్ట్.. వారం వారం మారాల్సిందే.. నిద్ర ఉండదు.. సంసారాలు సరిగా చేయలేరు.. దాదాపు 60శాతం మంది జర్నలిస్టుల సంసారాలు చట్టబండలవుతుంటాయి. అయినా శ్రీశ్రీ కవిత్వానికి బానిసైనట్టు.. జర్నలిస్టులు కూడా ఆ రంగానికి అంకితమైపోయారు. మారడానికి ఓ పట్టాన ఇష్టపడరు.

అసలు జర్నలిస్టులు అన్న పదం తప్ప తెరవెనుక ఏం జరుగుతుందనే విషయం జనంలో దాదాపు 80శాతం మందికి అవగాహన ఉండదు.. ఇన్వెస్టికేషన్ జర్నలిజం గురించి అయితే ఎవ్వరికీ నామమాత్రం కూడా తెలియదు.. నిఘా పోలీస్ వ్యవస్థను తలదన్నేలా రిపోర్టింగ్ చేసే జర్నలిస్టులు దేశంలో ఉన్నారు..

అయితే జర్నలిజంలో గడిపిన వారే అలాంటి విషయాలను నిశితంగా గమనించి సినిమా తీయగలరు. 2011లో తమిళనాడులో వచ్చిన ‘రంగం’ సినిమా జర్నలిజం బ్యాక్ డ్రాప్ తోనే వచ్చింది. ఆ సినిమా బంపర్ హిట్ అయ్యింది. తెలుగులోనూ అనువాదమైంది. దాని దర్శకుడు కేవీ ఆనంద్ మీడియాలో కొద్దికాలం పనిచేసి దర్శకుడిగా మారారు. అందుకే అంత నేచురల్ గా ఖచ్చితత్వంతో సినిమా తీశాడు. సంచలన విజయాన్ని అందుకున్నాడు.

ఇప్పుడు అదే తమిళంలో ఇదే జర్నలిజం బ్యాక్ డ్రాప్ తో సినిమా వచ్చింది. అది సంచలన విజయం అందుకుంది. ‘కనిదన్’ పేరుతో వచ్చిన ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లోతుల్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఇదే సినిమాను రీమేక్ చేసి తెలుగులో హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’గా తీశారు. తమిళ డైరెక్టర్ నే ఇక్కడ డైరెక్ట్ చేయించారు. రంగం సినిమాలోని జర్నలిజం లోతులకే ఫిదా అయిన ప్రేక్షకులు మరి ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిజాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇందులో ఏం చూపించారు.? ప్రేక్షకులు ఎంతటి విజయాన్ని అందిస్తారనేది వేచిచూడాల్సిందే..