Begin typing your search above and press return to search.

‘ఈపీసీ’ కోసం నిఖిల్ అంత కష్టపడ్డాడు మరి

By:  Tupaki Desk   |   26 Nov 2016 3:30 AM GMT
‘ఈపీసీ’ కోసం నిఖిల్ అంత కష్టపడ్డాడు మరి
X
‘స్వామి రారా’ దగ్గర్నుంచి ఒక్కసారిగా రూటు మార్చేశాడు యువ కథానాయకుడు నిఖిల్. ఆ సక్సెస్‌ను నిలబెట్టుకుంటూ జాగ్రత్తగా సినిమాలు ఎంచుకున్నాడు. వరుసగా కార్తికేయ.. సూర్య వెర్సస్ సూర్య.. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి వైవిధ్యమైన సినిమాలు చేసి.. వాటితో విజయాలందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుడ్‌విల్ సంపాదించుకున్నాడు. నిఖిల్ ఉన్న స్థాయికి ఇలాంటి రిస్కీ ప్రాజెక్టులు ఎంచుకోవడం.. అవి పూర్తయి సజావుగా రిలీజయ్యేలా చూడటం అన్నది చిన్న విషయం కాదు. ఈ విషయంలో నిర్మాతల అభిరుచిని కూడా మెచ్చుకోవాలి.

ఐతే ఇలాంటి సినిమాలకు నిర్మాతను ఒప్పించడమూ అంత సులువు కాదు. ఈ విషయంలో దాదాపుగా తన ప్రతి సినిమాకూ నిఖిల్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. తన దగ్గరికి మంచి కథలతో వచ్చిన దర్శకులకు అండగా నిలుస్తూ.. నిర్మాతల్ని కూడా తనే సెట్ చేస్తున్నాడు నిఖిల్. కార్తికేయ.. సూర్య వెర్సస్ సూర్య సినిమాలకు నిర్మాతల్ని సెట్ చేయడంలో అతడిది కీలక పాత్ర. తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విషయంలోనూ నిఖిల్ అలాగే కష్టపడ్డాడని చెబుతున్నాడు అతడి మేనేజర్ అయిన సీనియర్ నటుడు రాజా రవీంద్ర.

‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా కథ పట్టాలెక్కడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కథ నచ్చాక నిఖిల్.. నేను కలిసి నిర్మాత కోసం చాలా తిరిగాం. చాలామందిని కలిశాం. నిఖిల్ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎంతోమందిని కలిశాక చివరికి మేఘన ఆర్ట్స్ వాళ్లు ఓకే అయ్యారు. వాళ్లు ఎంతో ధైర్యం చేసి ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేశారు. రాజీ పడకుండా నిర్మించారు. అందుకు తగ్గ ఫలితం లభించింది’’ అని రాజా రవీంద్ర తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/